Devotional Thriller: షణ్ముఖ అందరికీ నచ్చుతుంది
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:17 PM
ఆది సాయికుమార్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన చిత్రం 'షణ్ముఖ'. అవికా గోర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను 'శాసనసభ' ఫేమ్ షణ్ముఖం తెరకెక్కించారు.
ఆది సాయికుమార్ (Aadi Saikumar), అవికా గోర్ (Avika Gor) జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ' (Shanmukha). మార్చి 21న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ ను మీడియా సమావేశంలో వెల్లడించింది చిత్రబృందం. ఈ సినిమాను 'శాసనసభ' (Sasana Sabha) రూపకర్త షణ్ముగం సాప్పని తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీ 'శాసన సభ' తర్వాత సాప్పని బ్రదర్స్ నిర్మించిన రెండో సినిమా ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఆది సాయికుమార్ మూవీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. విడుదలకు ముందే మూవీ డిజిటల్ హక్కులు, అన్ని భాషల శాటిలైట్ రైట్స్, థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉందన్నారు. తన చిత్రం విడుదలై సంవత్సరం దాటిపోయిందని, ఎట్టకేలకు తిరిగి 'షణ్ముఖ'తో రావడం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. రవి బసూర్ (Ravi Basrur) తన నేపథ్య సంగీతంతో మూవీని మరో స్థాయికి తీసుకెళ్ళారని ఆది చెప్పారు. అవికాతో వర్క్ చేయడం హ్యాపీగా అనిపించిందని, ఆమెతో మరో సినిమా చేయాలనుకుంటున్నానని అన్నారు.
Also Read: Dil Raju: ఆ రెండు సీక్వెల్స్ పై దిల్ రాజు ఫోకస్
నిర్మాత షణ్ముగం సాప్పని మాట్లాడుతూ, ''హిందీ డిజిటల్ హక్కులు, అదర్ స్టేట్స్ థియేట్రికల్ హక్కులు కూడా అమ్మేశాం. ఏపీ, తెలంగాణలో నా స్నేహితుడు శశిధర్ రెడ్డి దీనిని విడుదల చేయబోతున్నారు. ఇందులో ఆది పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నాడు. విజువల్ వండర్ గా, అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమా ఉండబోతోంది. ఇటీవల విడుదలైన చంద్రకళ సాంగ్ కు మంచి స్పందన వస్తోంది'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయిక అవికా గోర్ తో పాటు, ప్రతినాయక పాత్రధారి చిరాగ్ కూడా పాల్గొన్నారు.
Also Read: Bobby Simha: గురువును కలిసి ఎమోషన్ అయిన బాబీ సింహా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి