Shankar: అవుట్ ఫుట్ అసంతృప్తి.. ఏకంగా అయిదు గంటలే

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:33 PM

రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ (Shankar) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) చిత్రం. జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై దర్శకుడు శంకర్‌ వెరల్‌ కామెంట్స్‌ చేశారు. ‘‘గేమ్‌ ఛేంజర్‌’ అవుట్‌పుట్‌తో నేను సంతృప్తిగా లేను. నేను అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా నిడివి 5 గంటల వరకు ఉండాలి. సమయాభావం వల్ల కొన్ని సీన్స్‌ కట్‌ చేయాల్సి వచ్చింది. దీంతో కథ అనుకున్న విధంగా రాలేదు’’ అని శంకర్‌ అన్నారు. రామ్‌ చరణ్‌, ఎస్‌జే సూర్య? నటనపై ఆయన ప్రశంసలు కురిపించారు. (Game Changer 5 hours output) ఈ సినిమాపై వచ్చిన ఆన్‌లైన్‌ రివ్యూలు చూడలేదని చెప్పారు.  ఎక్కువగా మంచి రివ్యూలే  వచ్చినట్లు విన్నానన్నారు. ప్రస్తుతం శంకర్‌ చేసిన కామెంట్స్‌ వైరల్‌గా మారాయి.

మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఆన్‌లైన్‌ రివ్యూలు చూడకపోతే నేటి జనరేషన్‌ ఆలోచనలు ఎలా తెలుస్తాయని అభిప్రాయపడ్డారు. ఆరేళ్ల తర్వాత రామ్‌ చరణ్‌ ఈ సోలో చిత్రంతో ప్రేక్షకులను ప?కరించారు. ఇందులో ఆయన చేసిన అప్పన్న పాత్రకు ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు చరణ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తన హృదయంలో ‘గేమ్‌ ఛేంజర్‌’కు ప్రత్యేక స్థ్థానం ఉంటుందన్నారు. ‘మీరు గర్వపడేలా.. అద్భుతమైన పెర్ఫామెన్స్‌ ఇవ్వడం కొనసాగిస్తా’’ అని అభిమానులకు ఆయన ఆయన హామీ ఇచ్చారు.  

Updated Date - Jan 16 , 2025 | 12:34 PM