Shambala: విజువల్ ట్రీట్ గా శంబాల ప్రపంచం
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:45 PM
'శంబాల' మూవీ నుంచి విడుదలైన మేకింగ్ వీడియో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ కోసం మేకర్స్ పడుతున్న కష్టం కనపడుతోంది. విజువల్ ట్రీట్ గా వస్తున్న ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి.
యంగ్ హీరో ఆది సాయికుమార్ (Aadi Saikumar ) సాలిడ్ హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు. డిఫరెంట్ మూవీస్ చేస్తున్నా... ఆహా అన్న రేంజ్ లో హిట్ ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. దీంతో 'శంబాల' (Shambala) మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లకు అదిరిపోయే రెస్పాన్స్ రాగా... తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో....ఆ అంచనాలను డబుల్ చేసింది. అంతేకాక సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది.. మూవీ కాన్సెప్ట్ ఏంటి... అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటి అభిమానుల్లో రేకెత్తిస్తోంది.
ప్రస్తుతం వాస్తవానికి దూరంగా మరో ప్రపంచంలో జరిగే కథలకు ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ మిస్టిక్ వరల్డ్(Mystic World )లో రూపొందుతున్న సినిమా ‘శంబాల.’ ఏ యాడ్ ఇన్‌ఫినిటీ ఫేం యుగంధర్ ముని (Yugandhar muni) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. జస్ట్ పోస్టర్లతోనే ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి ఆడియన్స్‌ను తీసుకు పోతున్నామన్న హింట్ ఇచ్చారు మేకర్స్ . చెప్పినట్లుగానే తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో ( Making Video ) స్టన్నింగ్ అనిపించింది. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాలను చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. టీజర్ లోడింగ్ అంటూ వదిలిన ఈ వీడియోలో సినిమా కోసం యూనిట్ ఏ రేంజ్ లో కష్టపడుతోందో అర్థమవుతోంది.
ఖర్చులకు ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక (Swasika) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు టచ్ చేయని పాయింట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే దర్శకనిర్మాతలు.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. శంబాల ప్రపంచంతో ఈ సారి ఆది ఖాతాలో హిట్ పడుతుందని జోస్యం చెబుతున్నారు మూవీ లవర్స్.