Sekhar Kammula: ధనుష్ గుర్తు పడతాడో లేదోననే టెన్షన్.. కానీ ఆశ్చర్యపరిచాడు..
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:22 PM
‘‘కుబేర’ కథ సిద్థమైంది. బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా? అని కాస్త సంకోచించా! ఎందుకంటే అసలు నేను ఆయనకు తెలుసో లేదోనన్న అనుమానం నన్ను వెంటాడింది. నేను ఆయనకు ఫోన్ చేయగానే, ధనుష్ నన్ను ఆశ్చర్యపరిచారు
ధనుష్ (Dhanush), నాగార్జున(nagarjuna), రష్మిక కీలక పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కుబేర’ (Kubera) ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీకి సంబంధించి శేఖర్ కమ్ముల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ కథ ధనుష్‌కు చెప్పడానికి కాస్త సంకోచించినట్లు ఆయన అన్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘కుబేర’ కథ సిద్థమైంది. బిచ్చగాడి పాత్ర గురించి ధనుష్‌కు ఎలా చెప్పాలా? అని కాస్త సంకోచించా! ఎందుకంటే అసలు నేను ఆయనకు తెలుసో లేదోనన్న అనుమానం నన్ను వెంటాడింది. నేను ఆయనకు ఫోన్ చేయగానే, ధనుష్ నన్ను ఆశ్చర్యపరిచారు. నేను తీసిన సినిమాల్లో ఆయన ఫేవరెట్ మూవీలు, అందులోని సన్నివేశాల గురించి మాట్లాడటం మొదలు పెట్టారు. ధనుష్‌లాంటి నటుడితో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని శేఖర్‌కమ్ముల చెప్పుకొచ్చారు. రష్మిక గురించి మాట్లాడుతూ.. ‘‘రష్మిక చాలా కష్టపడతారు. ఈ కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ముంబయిలో ఆమె ‘యానిమల్’ మూవీ డబ్బింగ్ చెబుతున్నారు. అదే సమయంలో ‘పుష్ప2’ షూటింగ్ కూడా జరుగుతోంది. ముంబయి నుంచి హైదరాబాద్‌కు విరామం లేకుండా ప్రయాణిస్తూనే ఉన్నారు.
‘కుబేర’ సెట్‌కు వచ్చినప్పుడు ఒక్కరోజు కూడా ఆమెలో నీరసం కనిపించలేదు. నిజంగా ఆమె ఒక మెరుపు. ఇందులో మీ పక్కంటి అమ్మాయిగా రష్మిక కనిపిస్తారు. ఇప్పటివరకూ రష్మిక, ధనుష్ కలిసి నటించడం చూడలేదు. ఇందులో వారి స్ర్కీన్ ప్రజెన్స్ చాలా కొత్తగా ఉంటుంది’’ అని శేఖర్ కమ్ముల చెప్పారు.