SVSC Rerelease: వసుధైక కుటుంబానికి. ఇప్పుడు అదే క్రేజ్
ABN , Publish Date - Mar 07 , 2025 | 02:15 PM
2013లో విడుదలైన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీసు ముందుకు తీసుకొచ్చారు దిల్ రాజు . శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ను అలరిస్తుంది.
పెద్దోడు పాత్రలో వెంకటేశ్ (Venkatesh), చిన్నోడిగా మహేశ్ బాబు (Maheshbabu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో (SeethammaVakitloSirimalleChettu) సందడి చేశారు. వసుధైక కుటుంబం ఇత్తివృత్తంగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పెద్దోడు, చిన్నోడు పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దారు దర్శకుడు. 2013లో విడుదలైన ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి బాక్సాఫీసు ముందుకు తీసుకొచ్చారు దిల్ రాజు . శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ను అలరిస్తుంది. దీంతో ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. (SVSCReRelease( SeethammaVakitloSirimalleChettu,
ఇందులో కథ, కథనంతోపాటు పాటలు, డైలాగ్‌లో సోషల్ మీడియాలో ఇప్పటికీ షేర్ అవుతున్నాయి. తాజాగా థియేటర్‌లలోకి వచ్చిన ఈ సినిమా వీడియోలు ఎక్స్‌లో తెగ వైరల్‌గా మారాయి. విజయవాడలోని ఓ థియేటర్‌లో ఈ సినిమాలోని పెళ్లి సీన్‌ను రీ క్రియేట్ చేశారు. ఎన్ని సినిమాలు వచ్చినా ఈ కుటుంబ కథా చిత్రంతో పోటీకి రాలేవంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.