Sara Ali Khan: శ్రీశైలానికి సారా.. ఎందుకో తెలిస్తే

ABN , Publish Date - Jan 09 , 2025 | 10:29 AM

Sara Ali Khan: ఆమె మహా శివుడి భక్తురాలు. ప్రతి యేడు కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తుంది. స్నేహితులని కూడా తీసుకెళ్తోంది. అయితే తాజాగా ఆమె పోస్టు చేసిన పోస్టు ఒకటి వైరల్ గా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో.

Sara ali khan visited srisailam

ఓవైపు దేశ‌భ‌క్తి మ‌రోవైపు ర‌క్తితో కూడిన విభిన్న‌ పాత్ర‌ల‌తో బాలీవుడ్ లో పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ సారా అలీఖాన్‌. బాలీవుడ్ పఠాన్.. సైఫ్ అలీఖాన్ గారాల ప‌ట్టిగా 2018లో హిందీ సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ఈ అందాల సుంద‌రి అచీతూచి త‌న కేరీర్‌ను డెవ‌ల‌ప్ చేసుకుంటుంది. అందానికి అందం, న‌ట‌న‌, గ్లామ‌ర్ విష‌యంలో మోహ‌మాటం ఏ మాత్రం లేని ఈ చిన్న‌ది రొజురోజుకు ప‌రిశ్ర‌మ‌లో త‌న పేరును సుస్థిరం చేసుకుంటోంది. త‌న ఈడు వ‌య‌స్సున్న‌ జాన్వీ క‌పూర్‌, అన‌న్యాపాండే గ‌ట్టి పోటీ ఇస్తున్నా వాళ్ల‌ను అధిగ‌మించి సారా త‌న‌దైన‌ శైలిలో సినిమాల‌ను ఎంపిక చేసుకుంటూ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ పెయిడ్ అగ్ర క‌థానాయిక‌గా పేరు సంపాదించుకుంటోంది.


సారా.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె తండ్రి ముస్లిం, తల్లి సిక్కు. సారా మాత్రం అన్ని మతాలు తనవే అంటుంది. హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అన్ని మతాల పవిత్ర ప్రదేశాలను దర్శించుకుంటుంది. ఆమె మహా శివుడి భక్తురాలు. ప్రతి యేడు కేదార్‌నాథ్ యాత్రకు వెళ్తుంది. స్నేహితులని కూడా తీసుకెళ్తోంది. అయితే తాజాగా ఆమె పోస్టు చేసిన పోస్టు ఒకటి వైరల్ గా మారింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో. ఆమె ఈ ఏడాది తొలి సోమవారం కర్నూల్ లోని శ్రీశైల మల్లిఖార్జునుడి వద్ద గడిపింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. దీంతో సారా.. భక్తికి, కమ్మిట్మెంట్ కి అందరు మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.


మరోవైపు ఆమె మంచి ట్రావెలర్ కూడా.. గతేడాది ఇండియా మొత్తాన్ని చుట్టేసి వచ్చింది. దీని గురించి సోషల్ మీడియాలో రాస్తూ.. ఈ ఏడాది నాకు 2024 ఇచ్చినా సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు, సినిమాలు, సరదాలు, పౌర్ణమి ఉదయాలు, నక్షత్రాల ఆకాశం, కొలనులు, ట్రెక్స్, స్నేహితులు, జ్ఞాపకాలు, కాఫీలు, విమానాలు, వ్యాయామాలు, మమ్మీ నవ్వు, ఇగ్గీ ఆనందం, దోస్తోన్ కా సహారా, కేదార్‌నాథ్ యాత్ర, రాజధాని చక్కర్లు, జైసల్మేర్ ఇసుక, క్రూజ్ వాటర్స్, గంగా పరవళ్లు, అమ్మ ఉండే ఇంగ్లాండ్, నా ఉత్తరాఖండ్, ఇన్ని సుఖ, శాంతులు అందించినందుకు ధన్యవాదాలు. 2025 ఆనందం యొక్క అన్ని క్షణాలను ఆస్వాదించడానికి వేచి ఉండలేను అంటూ పోస్ట్ చేసింది.

Updated Date - Jan 09 , 2025 | 11:05 AM