Sankranti Releases: ఈ సంక్రాంతికి హీరోయిన్లే కీలకం..
ABN , Publish Date - Jan 05 , 2025 | 03:38 PM
Sankranti Releases: ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల్లో హీరోయిన్లు కీలక పాత్ర పోషించనున్నారు.
ఈ సంక్రాంతికి తెలుగు చిత్రసీమలో పోటీ గట్టిగానే ఉంది. అయితే ఈ సారి హీరోలో స్టామీనానే కాదు హీరోయిన్ల అభినయానికి కూడా స్పేస్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల్లో హీరోయిన్లు కీలక పాత్ర పోషించనున్నారు.
సక్సెస్ లేదు కానీ..
గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా రెండోసారి రామ్ చరణ్ తో కలసి నటిస్తోంది. వీరి తొలి సినిమా వినయ విధేయ రామ డిజాస్టర్ అయ్యింది. అయినా రామ్ చరణ్, శంకర్ లు ఈ సినిమాకు కియారనే కరెక్ట్ అని భావించి ఎంపిక చేశారు. పాటల్లో ఆమె గ్లామరే హైలైట్ కానుంది. తెలుగులో కియారా నటించిన తొలి చిత్రం 'భరత్ అనే నేను' కూడా యావరేజ్ గా నిలిచింది. సౌత్ లో ఆమెకు సాలీడ్ సక్సెస్ కావాల్సిన అవసరం ఉంది.
ముగ్గురు భామలతో బాలయ్య..
ఈ సంక్రాంతికి బాలకృష్ణ ముగ్గురు హీరోయిన్లతో తెరపైకి రానున్నారు.
ప్రగ్యా జైస్వాల్
ఇప్పటికే బాలయ్య 'అఖండ' సినిమాలో ప్రగ్యా నటనకు స్కోప్ ఉన్న పాత్రే లభించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండోసారి ఆమె బాలయ్య తో కలిసి నటించింది. అఖండ సక్సెస్ ను కంటిన్యూ చేయాలని తాపత్రయపడుతోంది. జనవరి 12 న ఆమె బర్త్ డే కూడా కావటంతో.. డాకు మహరాజ్ విడుదల కోసం ఆసక్తిగా వెయిట్ చెస్తోంది.
శ్రద్ధా శ్రీనాథ్
శ్రద్ధా శ్రీనాథ్ నటిగా ఇప్పటికే నిరూపించుకుంది. కానీ.. ఆమెకు సరైన సక్సెస్ కరువైంది. డాకులో శ్రద్ధా పాత్ర షాకింగ్‌గా ఉండనుంది.
ఊర్వశీ రౌతేలా
ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో పాటతో పాటు క్లైమాక్స్‌లోనూ కొంత పొర్షన్‌లో కనిపించనుంది. ఇప్పటికే తెలుగులో ఐటెం సాంగ్స్ చేసిన ఊర్వశీ.. డాకు మహరాజ్‌లో తన పాత్ర కు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా వస్తుందో అని ఎదురుచూస్తొంది.
వెంకటేష్‌తో పోటీగా..
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో పోటీ పడి కామెడీ చేస్తోంది ఐశ్వర్య రాజేష్. సినిమాలోనే కాదు.. ప్రమోషనల్ ఇంటర్యూస్ లోను ఐశ్వర్య సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. తెలుగమ్మాయి అయినా.. ఆమె తమిళ సినిమాలతో పేరు తెచ్చుకుంది. గతంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో హోమ్లీ రోల్‌లో నటించినా.. సినిమా ప్లాప్ కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలో ఐశ్వర్య నటనే ఓ హైలైట్ కానుందని టాక్.
ఇక వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిన మీనాక్షి యాక్షన్‌తో పాటు పూర్తిస్దాయి కామెడీ రోల్ లో నవ్వించేందుకు సిద్ధమవుతోంది.