Anil Ravipudi: ఫేక్ కలెక్షన్స్, ఐటీ దాడులపై స్పందించిన అనిల్ రావిపూడి

ABN , Publish Date - Jan 23 , 2025 | 06:57 AM

Anil Ravipudi: ప్రధానంగా 'పుష్ప 2', గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తునాం సినిమాల కలెక్షన్స్ ప్రచారం ఒకలా ఉంటే ట్యాక్స్ లు కట్టిన లెక్కలు మాత్రం మరొకలా ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మించిన దిల్ రాజుతో పాటు డైరెక్టర్ అనిల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారని వార్తలు ప్రచారం అయ్యాయి.

Anil Ravipudi on Fake Collections and ITRaids

ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులపై 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు 'పుష్ప 2' సినిమా డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు దాడి నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్లోనూ సోదాలు జరిగాయని కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు.


గత రెండు రోజులు నుండి హైదరాబాద్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు, నిర్మాతలపై ఐటీ అధికారులు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా 'పుష్ప 2', గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తునాం సినిమాల కలెక్షన్స్ ప్రచారం ఒకలా ఉంటే ట్యాక్స్ లు కట్టిన లెక్కలు మాత్రం మరొకలా ఉన్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పక్కన పెడితే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మించిన దిల్ రాజుతో పాటు డైరెక్టర్ అనిల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారని వార్తలు ప్రచారం అయ్యాయి.


వీటిపై ఆయన స్పందిస్తూ.. “నా మీద ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగలేదు. నాపై వస్తున్నది రాంగ్ న్యూస్. నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాను. నా దగ్గర కూడా డబ్బులున్నాయి కానీ అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. జీఎస్టీలు ఎప్పటికప్పుడు కడుతున్నాను. నాకొచ్చిన ప్రసాదాన్ని నేను జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటున్నాను. ఐటీ దాడులు జరిగేంత శ్రీమంతుడ్ని ఇంకా కాలేదు” అంటూ తనపై వస్తున్నా రూమర్స్ పై స్పష్టతనిచ్చారు.


పారితోషికం తక్కువే..

వరుసగా 7 హిట్ల తర్వాత తెరకెక్కించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కోసం అనిల్ రూ 15 కోట్ల పారితోషకం తీసుకున్నారని వార్తలొచ్చాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. “చాలామంది దర్శకులతో పోలిస్తే నా పారితోషికం తక్కువ అంటారు. అలాంటివేం నాకు తెలియవు. నా సినిమా బడ్జెట్ బట్టే నాకు రెమ్యూనరేషన్ ఇస్తారు. భవిష్యత్తులో పెంచుతారేమో నాకు తెలియదు” అన్నారు.

ఇక ఈ మధ్య కాలంలో చాలా వివాదం అవుతున్న మరో అంశం సినిమా పోస్టర్లపై ఫేక్ కలెక్షన్స్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారని. మరి దీనిపై అనిల్ ఏమన్నాడంటే.. "నా సినిమా వసూళ్ల పోస్టర్లను కచ్చితంగా నేను చెక్ చేసుకుంటాను. మహా అయితే జీఎస్టీ కలిపి వసూళ్లు వెల్లడిస్తాం తప్ప, అంతకుమించి అంకెలు మార్చమని" చెప్పారు.

Updated Date - Jan 23 , 2025 | 07:01 AM