Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం'ట్విట్టర్' రివ్యూ
ABN , Publish Date - Jan 14 , 2025 | 06:50 AM
Sankranthiki Vasthunam: ఫ్యామిలీ ఆడియెన్స్ ఫెవరెట్ హీరో వెంకీ మామ సినిమా అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీమియర్, బెనిఫిట్ షోస్ చూసిన అభిమానులు ఈ సినిమా గురించి ఏం చెబుతున్నారో ఓ లుక్కేదం.
విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికి కానుకగా నేడు(మంగళవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వాస్తవానికి సంక్రాంతికి ఎన్ని సినిమాల కంటే ఈ సినిమా వెరీ స్పెషల్. తెలుగు/సంక్రాంతి కల్చర్ లో ఎప్పుడో సినిమా భాగమైపోయింది. కుటుంబాలు అన్ని సంక్రాంతికి థియేటర్స్ కి వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలోనే ఫ్యామిలీ ఆడియెన్స్ ఫెవరెట్ హీరో వెంకీ మామ సినిమా అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీమియర్, బెనిఫిట్ షోస్ చూసిన అభిమానులు ఈ సినిమా గురించి ఏం చెబుతున్నారో ఓ లుక్కేదం.
ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్ని చోట్ల నుండి టాక్ గట్టిగా వినిపిస్తుంది. బుల్లి రాజు పాత్రలో వెంకీ ఆకట్టుకున్నాడు అంటున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేసిందని టాక్. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్ గానే ఉందని చెబుతున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్ ను మరోసారి అప్లై చేసినట్లు చెబుతున్నారు.
మరికొందరు కూడా ఈ సినిమాని కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే చెబుతున్నారు. వెంకీ పాత్రకు మంచి మార్కులు పడుతున్నాయి. సినిమాని ఎలివేట్ చేయడంలో సంగీతం కీలక పాత్ర పోషించిందని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. ప్రత్యేకంగా 'గోదారి గట్టు' సాంగ్ థియేటర్ లలో ఇంకా బాగుంది అంటున్నారు. ఐశ్వర్య, మీనాక్షిలు డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన టార్గెట్ ఆడియెన్స్ ని రీచ్ కావడంలో సక్సెస్ అయ్యాడు. హై ఇచ్చే టాప్ మూమెంట్స్ లేవు, ప్రిడిక్టబుల్ స్టోరీతో ఈ సినిమా డీసెంట్ అనిపించుకుంటుంది.
ఈ సంక్రాంతికి ఈ సినిమా అయితే ఫ్యామిలీ తో కలిసి చక్కగా చూడొచ్చని చెప్పొచ్చు. పూర్తి విశ్లేషణ, రివ్యూ కోసం మరికొన్ని గంటలు ఆగాల్సిందే.