Victory Veduka: ఊహకు మించి చేరువ.. 2027లో మళ్లీ సంక్రాంతికి వస్తాం
ABN , Publish Date - Feb 11 , 2025 | 10:06 AM
దేవుడా ఓ మంచి దేవుడా.. అడగకుండానే 'కలియుగ పాండవులు' సినిమాను ఇచ్చావ్... అక్కడి నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం' వరకూ తీసుకోచ్చావ్ మధ్యలో ప్రేమించుకుందాం రా, రాజా, గణేష్ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చావ్.. తర్వాత కలిసుందాం రా వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చావ్.. జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్లున్నావ్.. అడగకుండానే ఇవన్నీ చేస్తూనే ఉన్నావ్.. నువ్వు నాకు నచ్చావ్’ ఇంకా కొన్నేళ్లు ఇలాగే తీసుకెళ్లాలని
దేవుడా ఓ మంచి దేవుడా..
అడగకుండానే 'కలియుగ పాండవులు' సినిమాను ఇచ్చావ్...
అక్కడి నుంచి 'సంక్రాంతికి వస్తున్నాం' వరకూ తీసుకోచ్చావ్
మధ్యలో ప్రేమించుకుందాం రా, రాజా, గణేష్ వంటి సూపర్‌హిట్స్ ఇచ్చావ్..
తర్వాత కలిసుందాం రా వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చావ్..
జీవితాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్లున్నావ్..
అడగకుండానే ఇవన్నీ చేస్తూనే ఉన్నావ్..
అందుకే నువ్వు నాకు నచ్చావ్’
ఇంకా కొన్నేళ్లు ఇలాగే తీసుకెళ్లాలని..
నువ్వు తీసుకెళ్తావ్ నాకు తెలుసు.. ఎందుకంటే బేసికల్లీ యు ఆర్ గాడ్..
అంటూ తన సినిమా డైలాగ్‌ను తన కోసమే చెప్పుకున్నారు విక్టరీ వెంకటేశ్(Venkatesh)
సోమవారం రాత్రి హైదరాబాద్ జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో 'సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki Vastunnam) విక్టరీ వేడుక జరిగింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి నటించారు. దిల్ రాజు - శిరీష్ నిర్మించారు విక్టరీ వేడుకకు కె రాఘవేంద్రరావు, హరీశ్ శంకర్, వంశీ పైడిపల్లి, వశిష్ట తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కి సక్సెస్ షీల్డ్‌లను అందజేశారు.
వెంకటేశ్ మాట్లాడుతూ ‘‘సినిమా హిట్ అవుతుందని ఊహించాం. కానీ ఇంతగా ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్తుందనుకోలేదు. ఊహలకు మించి ఈ సినిమా ప్రేక్షకులకు చేరువైంది. ఐదు.. పదేళ్లుగా థియేటర్‌కి వెళ్లనివాళ్లు కూడా ఈ సినిమా కోసం వెళ్లారు. ఈ విజయం కలా? నిజమా? అనేది కూడా అర్థం కావడం లేదు. మంచి కుటుంబ కథా చిత్రం వేస్త చూసి విజయాన్ని అందించాలని ప్రేక్షకు?ని బలంగా కోరుకున్నారు. సినీ ప్రేమికులు, పరిశ్రమకి కృతజ్ఞతలు. మా గురువు కె.రాఘవేంద్రరావు కొన్నేళ్లుగా ఓ మంచి కుటుంబ కథ చేస్తే తప్పకుండా విజయవంతం అవుతుందని చెబుతుండేవారు. ఈ సినిమాతో ఆయన అంచనా నిజమైంది. నా అభిమానులు, నా కుటుంబ ప్రేక్షకులు సినిమా పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. మూతబడిన థియేటర్లను కూడా కళకళలాడించిందీ చిత్రం. 2027లో మళ్లీ సంక్రాంతికి వస్తాం. రికార్డులు కొట్టడానికి కాదు. ప్రేక్షకులకు వినోదం పంచడమే నాకు ముఖ్యం’’ అని అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమకి సంక్రాంతిని తీసుకొచ్చిందీ చిత్రం. సంక్రాంతికి విడుదలైన ఓ సినిమా ఇన్ని రోజులుగా అన్ని థియేటర్లలో ఆడటం చాలా రోజుల తర్వాత చూస్తున్నా. నేను భక్తి సినిమాలు చేసినా వినోదం, గ్లామర్‌ని బలంగా నమ్ముతాను. ఆ కోణంలోనే ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. అందరూ చాలా సహజంగా నటించారు’’ అని అన్నారు.