Prabhas: దర్శకులందు సందీప్ రెడ్డి వంగా వేరయా..
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:42 PM
దేశంలో ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరో చుట్టూనే తిరుగుతుంది. ఏ మేకర్ అయినా బాబు.. బాబు అంటే హీరోల భజన చేయాల్సిందే. ఏ మాటకు ఆ మాటే.. హీరో ఎవరనే దానిపైనే సినిమా నడిచేది.. మార్కెట్ జరిగేది, జనాలు థియేటర్‌కి వచ్చేది.
దేశంలో ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరో చుట్టూనే తిరుగుతుంది. ఏ మేకర్ అయినా బాబు.. బాబు అంటే హీరోల భజన చేయాల్సిందే. ఏ మాటకు ఆ మాటే.. హీరో ఎవరనే దానిపైనే సినిమా నడిచేది.. మార్కెట్ జరిగేది, జనాలు థియేటర్‌కి వచ్చేది. వన్స్ సినిమా ఫైనల్ అయింది అంటే హీరో చెప్పినట్లే జరగాలి. ‘ఫలానా టైమ్‌లో షూటింగ్ పెట్టుకోండి’ హీరోయిన్ ఫలానా అమ్మాయి ఉండాలి’ అంటే మేకర్స్ చచ్చినట్లు ఓకే అనాల్సిందే. ప్రస్తుత సినారియో ఇది. ఉదాహరణకు ఓ సినిమాలో ప్రభాస్ హీరో అయితే ఆయన చెప్పిందే రూల్. ప్రభాస్ (Prabhas) షూటింగ్ కి వస్తే వచ్చినట్టు, లేదంటే ఆ రోజు పేకప్’. దానికి సిద్ధమైతేనే సినిమా. ‘బాహుబలి’ (bahubali) తరవాత ప్రభాస్ రేంజ్ ఇంటర్‌నేషనల్ స్థాయికి చేరిపోయింది. ప్రస్తుతం ఆయన కూడా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. ఏ సినిమాకి ఎప్పుడు డేట్లు ఇస్తారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ‘ఫౌజీ’, ‘రాజాసాబ్’ సినిమాల షూటింగులు ఇలానే జరుగుతున్నాయి.
అయితే సందీప్ రెడ్డి వంగా 9Sandeep reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit) విషయంలో మాత్రం ప్రభాస్ పప్పులు ఉడకడం లేదని టాక్. కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. అతను ముక్కుసూటి మనిషి. ఎదుటి వ్యక్తి ఎవరైనా చెప్పాలనుకున్నటి చెప్తాడు. మాట్లాడాలనిపించింది మాట్లాడతాడు. అతనికంటూ ఓ స్పెషాలిటీ ఉంది. సినిమాని ఎంత ప్రేమిస్తాడో తెలిసిందే. సినిమా తరవాతే ఎవరైనా. తన మాటల్లో, చేతల్లో అదే స్పష్టమవుతూ ఉంటుంది. అందుకే తన నుంచి అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాలు వచ్చాయి. ‘స్పిరిట్’ విషయంలోనూ తనకు ఓ స్పష్టత ఉంది. ప్రభాస్‌తో ఎలాంటి సినిమా తీయాలి? అనే విషయంలో గట్టిగా ఫిక్సయి ఉన్నాడు. ప్రభాస్ షరతులు పెట్టడం కాదు, ప్రభాస్‌కే షరతులు పెడుతున్నాడు సందీప్‌రెడ్డి వంగా. తన సినిమా మొదలైనప్పటి నుంచీ, పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదన్నది అతని కండీషన్. ఎందుకంటే ‘స్పిరిట్’ లుక్ వేరు. ఆ లుక్‌తో బయట ఎక్కువగా కనిపించకూడదన్నది సందీప్ ఉద్దేశం. అంతేకాదు.. కాల్షీట్లు బంచ్‌గా ఇవ్వాలి. వారానికి ఒకరోజో, రెండు రోజులో ఇస్తే సరిపోదు, కుదరదు. లేట్ అయినా బల్క్ కాల్షీట్లు కావాలి. బాడీ డబుల్స్‌పై ఆధారపడి పడి షాట్లు తీయకూడదు. డూప్ అనే ప్రస్తావనే లేదు. ఇవన్నీ సందీప్ కండీషన్లు. వీటన్నింటికి ప్రభాస్ ఒప్పుకున్నాడు.
గత రెండు చిత్రాల నుంచి ప్రభాస్ కాస్త రిలాక్స్ మోడ్‌లో ఉన్నాడు. ‘రాజాసాబ్’ విషయంలో ఇదే కనిపించింది. ప్రభాస్ మధ్యమధ్యలోఒ ఫారిన్ ట్రిప్పులు వేశాడు. దాంతో సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ పద్థతికి చెక్ పెట్టడానికే సందీప్ ఈ నిర్ణయం తీసుకొన్నాడని టాక్. సందీప్ పట్టుదల ఏమిటో ప్రభాస్‌కు తెలుసట. అందుకే సరెండర్ అయి అన్నింటికీ సరేన్నాడట. తనకు సరెండర్ అయిపోతే ఎలాంటి సినిమా ఇస్తాడో కూడా ప్రభాస్‌కు తెలుసు. అందుకే ప్రభాస్ కూడా సై అన్నాడు. హీరోని తన ఆధీనంలోకి తీసుకున్న అతి తక్కువ మంది దర్శకుల్లో సందీప్ ఒకరు. అతని గట్స్‌ను అభినందించాల్సిందే.