Sandeep Reddy: కన్సీవ్ సమస్యతో సంతాన ప్రాప్తిరస్తు

ABN , Publish Date - Mar 05 , 2025 | 02:09 PM

ఇవాళ స్పెర్మ్ కౌంట్ తక్కువ అనేది మగవాళ్ళలో ఉన్న అతి పెద్ద సమస్య. దాంతో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అలాంటి ఓ జంటగా కథగా 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీ రాబోతోంది.

అల్లు శిరీష్ తో 'ఏబీసీడీ' చిత్రాన్ని, రాజ్ తరుణ్ తో 'అహ నా పెళ్ళంట' వెబ్ సీరిస్ ను రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి. అలానే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ' చిత్రాలు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుంటోంది 'సంతాన ప్రాప్తిరస్తు' (Santhana Prapthirasthu) మూవీ. ఈ మూవీ టీజర్ ను తాజాగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) విడుదల చేశారు. ఇందులో అన్ని సీన్స్ తెగ నవ్వించాయని, మూవీ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. 'సంతాన ప్రాప్తిరస్తు' మూవీని మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు.


sp123.jpg

టీజర్ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేసే హీరో విక్రాంత్ మీద వర్క్ ప్రెజర్ ఎక్కువే ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో యూత్ లైఫ్ కు విక్రాంత్ (Vikranth) ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తాడు. అందమైన అమ్మాయి చాందినీ చౌదరి (Chandini Chowdary)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఆమె తండ్రికి ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం ఉండదు. విక్రాంత్ స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం ఈ కొత్త జంట పేరెంట్స్ కాలేకపోతారు. స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు వైద్యుల సలహాలు, డైట్ ఫాలో అవుతూ వంద రోజుల్లో తన భార్యను ప్రెగ్నెంట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు హీరో. ఈ ప్రయత్నంలో తను సక్సెస్ అయ్యాడా లేదా అనేది సినిమా కథని టీజర్ బట్టి అర్థమౌతుంది. విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ (Vennela Kishore), తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar), అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్ కశ్యప్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

నిజానికి ఇలాంటి సమస్య నేపథ్యంలో గతంలో తెలుగులో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటికి పెద్దంత ఆదరణ ప్రేక్షకుల నుండి లభించలేదు. మరి మరోసారి 'కన్సీవ్' సమస్యల నేపథ్యంలో వస్తున్న 'సంతాన ప్రాప్తిరస్తు'ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

Also Read: Santosh: మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా వస్తున్న ఆర్టిస్ట్....

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 05 , 2025 | 02:14 PM