Samyuktha Menon: కుంభమేళాలో టాలీవుడ్ లక్కీ చార్మ్..

ABN , Publish Date - Feb 05 , 2025 | 09:07 AM

'జీవితంలో విశాలతను మనం కళ్లారా చూసినప్పుడు దానికి మించింది మరోకటి లేదు అనిపిస్తుంది. అనంతమైన స్ఫూర్తి కోసం నా సంస్కృతిని నేను ఎంతో ఆదరిస్తాను. మహా కుంభ మేళాలో భాగంగా గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తున్నప్పుడు నా మనసు మరింత తేలికపడింది'

Samyuktha Menon Takes Holy Dip at Kumbh Mela

ఉత్తర ప్రదేశ్‌ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. సామాన్యులతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఇక్కడకు తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రధానంగా సినీ పరిశ్రమకు చెందిన నటీ, నటులు కుంభ మేళాలో సందడి చేస్తున్న ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా క్రేజీ టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం స్నానం ఆచరించింది. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'జీవితంలో విశాలతను మనం కళ్లారా చూసినప్పుడు దానికి మించింది మరోకటి లేదు అనిపిస్తుంది. అనంతమైన స్ఫూర్తి కోసం నా సంస్కృతిని నేను ఎంతో ఆదరిస్తాను. మహా కుంభ మేళాలో భాగంగా గంగా నదిలో పవిత్రమైన స్నానం చేస్తున్నప్పుడు నా మనసు మరింత తేలికపడింది’ అంటూ రాసుకొచ్చింది.


‘భీమ్లా నాయక్’ సినిమాలో పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ ఒక జంటగా నటిస్తే.. మరో జంటగా రానా దగ్గుబాటి, సంయుక్త నటించారు. ఈ సినిమాలో నిత్యామీనన్‌ పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అంతే ప్రాముఖ్యత సంయుక్త పాత్రకు కూడా ఉంటుంది. ఆ పాత్రలు వారిద్దరికీ మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పటి వరకు హీరోల పక్కన నటిస్తూ సక్సెస్ అందుకుంటున్న సంయుక్త .. తొలిసారి ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటించబోతున్న చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమవగా.. ఈ సినిమాకు క్లాప్‌ను ‘భీమ్లా నాయక్’లో తనకు భర్తగా నటించిన రానా దగ్గుబాటి కొట్టారు.


వరుస బ్లాక్‌బస్టర్స్‌ సినిమాలతో అలరిస్తున్న టాలీవుడ్ లక్కీ చార్మ్ సంయుక్త తొలిసారిగా ఫీమేల్ సెంట్రిక్ మూవీ చేస్తున్నారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలను అందించిన సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మించనున్న ఈ చిత్రానికి యోగేష్ కెఎంసి దర్శకుడు. మాగంటి పిక్చర్స్‌తో కలిసి హాస్య మూవీస్ ప్రొడక్షన్ నంబర్ 6‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సంయుక్తనే సమర్పిస్తోంది. బుధవారం రామానాయుడు స్టూడియోస్‌లో పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Updated Date - Feb 05 , 2025 | 09:11 AM