Samantha: ప్రతి ఒక్కరి కథ మాస్టర్ పీస్ అవుతుంది
ABN , Publish Date - Mar 08 , 2025 | 06:15 PM
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత తనదైన శైలిలో మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు.
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత (Samantha) తనదైన శైలిలో మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు (Womensday wishes) తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘తుఫానులను దయతో నావిగేట్ చేేసది. ప్రపంచాన్ని తన నిశ్శబ్ద కౌగిలిలో పట్టుకున్నది. అడుగడుగునా కలలను బ్యాలెన్స్ చేసేది, ఊపిరి పీల్చుకున్నప్పుడు కూడా పైకి లేచేది. తిరిగి అడగకుండా ఇచ్చేది, ఆవేశంతో రగిలిపోయేది, అయినా ఆరాటపడుతూనే ఉంటుంది, భారాలు, కాంతి రెండింటినీ మోసే ఆమె చీకటి రాత్రిలో కూడా ప్రకాశిస్తుంది. అవన్నీ తప్పిపోకుండా చేస్తుంది, తను ఎదుర్కొన్న ప్రతి సవాల్ తిప్పికొడుతుంది. ఆమె తన శక్తితో ఎప్పుడూ మండుతూనే ఉంటుంది’ అని సమంత రాసుకొచ్చి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దీనితోసాటు మరో వీడియో షేర్ చేశారు.
ఎర్లీ మార్నింగ్ లైఫ్, ఓ వాగ్దానం, ఓ ఆశ, చిన్న కల, ఏదో ధైర్యం, చేయగలననే నమ్మకం తను ఏదో రాయాలనుకుంటుంది’’ అంటూ వీడియోలో పేర్కొన్నారు. వండర్ విమెన్స్‌కి ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కొవడం, రాతను తిరగరాస్తే ప్రతి ఒక్కరి కథ మాస్టర్ పీస్ అవుతుంది. ప్రయత్నం చేస్తే సాధించగలం. ప్రతి ఒక్కరూ సొంత కథను రాసుకోగలం అని సమంత రాసుకొచ్చారు.