Subham: సమంత ఇదంతా ఎప్పుడు చేసింది..
ABN , Publish Date - Mar 15 , 2025 | 06:19 PM
సమంత తన సొంత బ్యానర్ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ఈ సినిమా చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది.
సమంత Samantha) తన సొంత బ్యానర్ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ (Tralala moving Banner) బ్యానర్‌పై నిర్మిస్తున్న తొలి చిత్రం ‘శుభం’ (Subham). ఈ సినిమా చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. ఇక త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌తోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రం ఉండబోతోందని తెలుస్తోంది. వసంత్ మరిగంటి రాసిన ఈ కథను 'సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) తెరకెక్కిస్తున్నారు.
త్రాలాల బ్యానర్ మీద ఈ సినిమాను మొదటి ప్రాజెక్ట్‌గా ఎందుకు ఎంచుకున్నామో త్వరలోనే అందరికీ తెలుస్తుందని సమంత అన్నారు. ఈ చిత్రంలో సి.మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మృదుల్ సుజిత్ సేన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు బయటకు రానున్నాయి.