Samantha: నేను అలా చేశా.. మీరు చేసి చూడండి.. మళ్లీ  మళ్లీ  చేస్తారు 

ABN , Publish Date - Feb 20 , 2025 | 11:32 AM

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సామ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.


సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా సామ్‌ పెట్టిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియా రాజ్యమేలుతున్న రోజుల్లో, ప్రతి ఐదు నిమిషాల్లో రెండు నిమిషాలు ఫోన్‌కే కేటాయిస్తున్న సమయంలో మూడు రోజులపాటు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఆ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (Samantha loves her own company)

Sam-2.jpg

‘‘మూడు రోజులు సైలెంట్‌గా ఉన్నాను. ఫోన్‌ లేదు. ఎవరితో కమ్యూనికేషన్‌ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి. అతి భయంకరమైనది. కానీ, ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్‌సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇలా ఉండటానికి ప్రయత్నించండి’’ అంటూ సూచనలిచ్చారు. ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేసిన ఈ విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సమంత ప్రస్తుతం ఆరోగ్యంపై పూర్తి శ్రద్థ పెట్టినట్లు ఈ పోస్ట్‌ ద్వారా తెలుస్తోంది. (Samanth Three Days Silence)
 


Sam-3.jpgఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె దృష్టి కథానాయికగా ప్రాధాన్యం ఉన్న చిత్రాలపై ఉంది.  మరోవైపు ఓటీటీ వేదికగా భిన్నమైన కథలతో సత్తా చాటుతున్నారు. వరుణ్‌ ధావన్‌తో ఆమె నటించిన ‘సిటడెల్‌ : హనీ బన్నీ’ ప్రేక్షకులను అలరించింది. అయితే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు నామినేట్‌ కాగా అడుగు దూరంలో అవార్డ్‌ మిస్‌ అయింది. తాజాగా ఈ వెబ్‌సిరీస్‌కు  ఐకానిక్‌ గోల్డ్‌ అవార్డ్‌ లభించింది. ఉత్తమ వెబ్‌సిరీస్‌గా అవార్డు గెలుచుకుంది. ఈ విషయాన్ని సామ్‌ ఇన్‌స్టా వేదికగా తెలిపింది. ప్రస్తుతం ‘రక్త్‌బ్రహ్మాండ్‌’తో బిజీగా ఉన్నారు సామ్‌. ది బ్లడీ కింగ్‌డమ్‌ అనేది ఉపశీర్షిక. ‘తుంబాడ్‌’ ఫేమ్‌ రాహి అనిల్‌ బార్వే దర్శకుడు. ఇటీవలే ఈ షూటింగ్‌లో జాయిన్‌ అయినట్లు సమంత చెప్పారు.. ‘మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వచ్చేశా’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఆదిత్యరాయ్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు తెరపైకి రాని కథతో దీన్ని రూపొందిస్తున్నారు.

Updated Date - Feb 20 , 2025 | 11:35 AM