Samantha: అనుపమ కోసం.. సమంత ఏం చేసిందంటే

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:04 PM

కమర్షియల్ సినిమాల్లో హీరోలకు జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తే ఫ్యాన్స్ చేసే హంగామా నెక్ట్స్ లెవల్. కానీ లేడీ ఓరియెంటెండ్ మూవీల్లో గెస్ట్ అపీరియన్స్ కు స్కోప్ తక్కువగా ఉంటుంది.

కమర్షియల్ సినిమాల్లో హీరోలకు జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తే ఫ్యాన్స్ చేసే హంగామా నెక్ట్స్ లెవల్. కానీ లేడీ ఓరియెంటెండ్ మూవీల్లో గెస్ట్ అపీరియన్స్ కు స్కోప్ తక్కువగా ఉంటుంది. అందులోను హీరోయిన్లకు అస్సలు ఛాన్స్ ఉండదు. కానీ ఓ హీరోయిన్ సినిమాకి మరో స్టార్ హీరోయిన్ అతిథిగా మారడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు అంతకు ముందు ఓ సినిమాలు సందడి చేయగా... చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కనిపించడం ఆసక్తికరంగా మారింది.

టిల్లు స్క్వేర్ (Tillu Sqaure) సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పరదా (Parada) అనే లేడి ఓరియేంటెడ్ మూవీ చేస్తోంది.ఇప్పటికే రిలీజైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రస్టింగ్‍గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో, ఇంటెన్సిటీతో మెప్పించింది. మిస్టరీ అడ్వెంచర్ గా వస్తున్న ఈ మూవీకి మరింత హైప్ ఇచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ రోల్ లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకే హైలెట్ గా నిలిచే రోల్ అంటూ ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్.... నెవర్ బిఫోర్ అనేలా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల. మాములుగా ఒక సినిమాలో ఒక హీరోయిన్ ఉంటేనే... రచ్చ మాములుగా ఉండదు. అలాంటి ఓ లేడీ ఓరియంటెడ్ లో మరో బ్యూటీ స్క్రీన్ షేర్ చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. (Samantha For parada)


పరదాలో సామ్ నటిస్తుందన్న వార్తలపై మేకర్స్ అధికారికంగా ప్రకటించనప్పటికి జస్ట్ గాసిప్ తోనే సినిమాకు కావాల్సినంత బజ్ వచ్చేసింది. పైగా అనుపమ , సమంత ఇంతకు మూవీ అఆ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అప్పట్లో కామియో రోల్ లో అనుపమ నటిస్తే... ఇప్పుడు పరదాలో సమంత సర్ ప్రైజింగ్ రోల్ లో కనిపించనుందట. దీంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ వార్త నిజమో అబద్దమో తెలియదు కానీ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నిజంగా ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒక సినిమాలో కనిపిస్తే ఇక ఫ్యాన్స్ కు పండగ. మరీ పరదా సినిమాకి ఏ రేంజ్ హైబ్స్ ఉంటాయో చూడాలి.

Updated Date - Mar 12 , 2025 | 06:11 PM