Samantha: సినిమాల్లేవు.. హిట్ లేదు.. ప్రేమ మాత్రం..
ABN , Publish Date - Mar 21 , 2025 | 04:25 PM
టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంతకు చెన్నైలో జరిగిన అవార్డు వేడుకలో అందిన గౌరవం ఏంటంటే
చెన్నై వేదికగా జరిగిన ఓ అవార్డ్ వేడుకలో సమంత (Samantha) భావోద్వేగానికి గురయ్యారు. 2010 నుంచి ఇప్పటిదాకా, వైవిధ్యమైన, స్ఫూర్తిదాయక పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తునందుకు ఆమెను కె.బాలచందర్ హాల్ ఆఫ్ ఫేమ్ K Balachandar hall of Fame) అవార్డుతో సత్కరించారు. అవార్డు అందుకున్న తర్వాత ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఈ అవార్డు అందుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. కె.బాలచందర్‌గారి పేరుతో అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం. ఆయన ఎన్నో అద్భుతమైన పాత్రలను సృష్టించారు. ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయన చిత్రాల్లో స్ర్తీ పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయి. ఆయన సినిమాల నుంచి నేనెంతో స్ఫూర్తి పొందా. ఈరోజు నా జీవితం పరిపూర్ణమైన ట్లు అనిపిస్తుంది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసినవారందరికీ ధన్యవాదాలు మామూలుగా ఒక సినిమా హిట్ అయితే మనల్ని ప్రేమించేవారు ఉంటారు. కానీ, రెండేళ్లు అయింది ఒక్క తమిళ సినిమా నేను చేయలేదు. ఈ మధ్యకాలంలో హిట్ సినిమా లేదు నాకు. అయినా నాపై మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. మీ ప్రేమను చూస్తుంటే నాకు మాటలు రావడం లేదు. ఇంత ప్రేమ పొందేందుకు నేనేం చేశానో కూడా నాకు తెలియదు. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అభిమానుల వల్లే నేనీ స్థాయిలో ఉన్నా. మీరు లేకుండా నేను లేను’’ అని అని సమంత అన్నారు.
ఇటీవల సామ్ ‘సిటడెల్ హనీ బన్నీ’తో ప్రేక్షకులను అ?రించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రక్త్ బ్రహ్మాండ్’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు ఉన్నాయి. అలాగే నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం శుభం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.