Samantha: త్వరలో వచ్చేస్తా.. డోంట్ వర్రీ..
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:00 AM
పార్వతీ తిరువోతు (ఉల్లొళుక్కు), సాయి పల్లవి (అమరన్), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియా భట్ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్‌ఎల్), దివ్య ప్రభ (ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్). వీరంతా రాక్‌స్టార్స్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే మరో వీడియో చేసి చెబుతా అని సరదాగా సంభాషించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటి సమంత ఆదివారం సాయంత్రం ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నానని తెలిపారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ర్టీలో బెస్ట్ హీరోయిన్ ఎవరో ఆమె తెలిపారు. పార్వతీ తిరువోతు (ఉల్లొళుక్కు), సాయి పల్లవి (అమరన్), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియా భట్ (జిగ్రా), అనన్య పాండే (సీటీఆర్‌ఎల్), దివ్య ప్రభ (ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్). వీరంతా రాక్‌స్టార్స్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే మరో వీడియో చేసి చెబుతా అని సరదాగా సంభాషించారు. "నెగెటివ్ ఆలోచనలను అధిగమించడానికి ప్రత్యేకంగా చేసేదేమీ లేదని, రెగ్యులర్‌గా చేసే మెడిటేషన్ తదితర వాటి వల్ల నెగెటివిటీ దూరం అవుతుందనుకుంటున్నా’’ అని తెలిపారు.
ఫ్యాన్: మీరు వరుస సినిమాలు చేయండి? మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. వచ్చేయండి?
సమంత: తప్పకుండా మళ్లీ తిరిగి వస్తున్నా బ్రో(BRO)
ఇటీవల జీవితం నేర్పిన గుణపాఠం ఏంటి?
సమంత: ఇటీవల కొన్ని రోజులు ఫోన్‌కు దూరంగా ఉన్నా. మొబైల్ లేకపోవడంతో మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. దానికి ఎంతగా అడిక్ట్ అయ్యామో అర్థమైంది’’ అని సమంత అన్నారు.
ప్రస్తుతం సమంత ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’లో నటిస్తున్నారు. ‘తుంబాడ్’ ఫేమ్ రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌లో ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించారు. ఇప్పటిదాకా దానిపై మరో అప్‌డేట్ రాలేదు.