Samantha: ఆ బంధాన్ని ఏమని పిలవాలో తెలీదు..
ABN , Publish Date - Apr 25 , 2025 | 01:27 PM
కోలీవుడ్‌లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ (Golden Queen) పురస్కారాల్లో సమంత (Samantha) గోల్డెన్ క్వీన్‌గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సామ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోలీవుడ్‌లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ (Golden Queen) పురస్కారాల్లో సమంత (Samantha) గోల్డెన్ క్వీన్‌గా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సామ్ తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్‌తో తన అనుబంధాన్ని పంచుకున్నారు. తనకు యాక్షన్ ఫిల్మ్ చేయాలనుందని సామ్ చెప్పారు.
‘‘నాకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) నావెంటే ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు. మా అనుబంధానికి పేరు పెట్టలేను. నా స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్తసంబంధీకుడా అని చెప్పలేను. ఇంతమంది ఫ్యాన్స్‌ను సొంతం చేసుకోవడం నా అదృష్టం. అదృష్టంతోపాటు నేను పడిన కష్టమే ఈరోజు ఇంతమంది అభిమానానికి కారణం. దేవుడిచ్చిన వరంగా భావిస్తాను మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని దృష్టిలో ఉంచుకొని కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ ఎవరైనా అలా డిసైడ్ చేస్తే అది అబద్థమే అవుతుంది. తెలిసి, తెలియక తీసుకున్న ఎన్నో నిర్ణయాలని కెరీర్‌పై ప్రభావం చూపుతాయి’’ అని సమంత అన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకురాలు సుధా కొంగర మాట్లాడుతూ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘సమంతకు నేను ఫ్యాన్‌ని. 5 సంవత్సరాలుగా ఆమెను దగ్గర నుంచి చూస్తున్నాను. ఆమె బాధ పడినప్పుడు నాకు కన్నీళ్లు వచ్చేవి. సమంతను చూసి ఎంతో మంది అమ్మాయిలు ధైర్యం తెచ్చుకోవాలి. ఆమెతో సినిమా తీయాలని రెండుసార్లు ప్రయత్నించాను. కానీ, కుదరలేదు. ఎప్పటికేౖనా సమంతతో కచ్చితంగా సినిమా తీస్తాను. ఆమె నటించిన ‘ఊ అంటావా..’ సాంగ్ అంటే చాలా ఇష్టం. కచ్చితంగా సామ్‌తో యాక్షన్ ఫిల్మ్ చేస్తానని దర్శకురాలు సుధా కొంగర అని అన్నారు.