Sai Pallavi: వైద్యుల సలహా.. విశ్రాంతి అవసరం
ABN , Publish Date - Feb 01 , 2025 | 12:12 PM
సాయిపల్లవికి (Sai pallavi) విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారని దర్శకుడు చందు మొండేటి చెప్పారు. అసలు ఏమైంది..
సాయిపల్లవికి (Sai pallavi) విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఆమె అనారోగ్యానికి గురయ్యారని దర్శకుడు చందు మొండేటి ముంబయిలో జరిగిన ‘తండేల్’ (Thandel) ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చెప్పారు. అందుకే ఆమె ఈవెంట్‌కి హాజరు కాలేకపోయారని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘‘సాయిపల్లవి కొన్ని రోజుల నుంచి జ్వరం, జలుబు తో బాధ పడుతున్నారు. అయినా సినిమాకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమె మరింత నీరసించారు. వైద్యులు ఆమెకు కనీసం రెండు రోజులు బెడ్ రెస్ట్ *(Sai Pallavi - Bed rest)అవసరమని సూచించారు. అందుకే ఆమె ముంబయి వేదికగా జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు’’ అని అన్నారు.
నాగచైతన్య(Naga Chaitanya), సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వం వహించిన చిత్రం ‘తండేల్’. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ ప్రేమకథలో రాజుగా నాగచైతన్య, బుజ్జిగా సాయిపల్లవి కనిపించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
READ MORE: Pavithra Gowda: ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసి.. స్వేచ్ఛగా తిరుగుతున్నావా..
Chiranjeevi - Odela Srikanth: మళ్లీ అతనికే అవకాశం ఇచ్చారా.. హైప్ ఖాయం..
-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి