Sai Kumar: సాయి కుమార్ అంటే నాలుగు సింహాలు కాదు.. 

ABN , Publish Date - Jan 10 , 2025 | 11:50 AM

Sai Kumar: 2006లో సామాన్యుడు చిత్రంలోని పాత్రకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. 2010లో ప్రస్థానం చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సాధించారు. సామాన్యుడు, ప్రస్థానం, రంగ్ తరంగ్ చిత్రాలలో నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ప్రస్థానం సినిమాకు టీఎస్సార్-టీవీ 9 అవార్డును అందుకున్నారు.

Actor Sai kumar

సాయి కుమార్ అంటే అందరికీ నాలుగు సింహాల డైలాగ్ గుర్తుకు వస్తుంది. పోలీస్ స్టోరీ సినిమాతో ఇండియన్ సినిమా హిస్టరీలో సాయి కుమార్ చెరగని ముద్ర వేసుకున్నారు. 1961 జులై 27న సాయి కుమార్ జన్మించారు. తండ్రి పి.జె.శర్మ, తల్లి కృష్ణ జ్యోతి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు సాయి కుమార్. తల్లి కృష్ణ జ్యోతి ఒకప్పుడు కన్నడ చిత్ర రంగంలో నటిగా సుప్రసిద్ధురాలు. అలా సాయి కుమార్‌కు కన్నడ మాతృ భాష అయింది. కానీ సాయి కుమార్ మాత్రం సౌత్ ఇండస్ట్రీపై తన మార్క్ వేశారు.


సినిమాల్లోకి రాక ముందు అంటే.. సరిగ్గా 1972 అక్టోబర్ 20న తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. మయసభ నాటకంలో దుర్యోధనుడి పాత్రలో నటించారు. ఆ తర్వాత నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. బాలనటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన సాయికుమార్ ‘దేవుడు చేసిన పెళ్లి’తో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా 1975లో జనవరి 9న రిలీజ్ అయింది. అంటే నేటికి యాభై ఏళ్లు పూర్తయ్యాయి. ఆ తరువాత బాపు దర్శకత్వం వహించిన స్నేహం సినిమాలో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు. సాయి కుమార్ కెరీర్‌లో ఎన్నో మరుపు రాని హిట్ చిత్రాలున్నాయి. కన్నడ, తెలుగులో ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో ఆయన నటించారు.

WhatsApp Image 2025-01-10 at 12.01.27.jpeg


కన్నడలో పోలీస్ స్టోరీ తరువాత అగ్ని ఐపీఎస్, కుంకుమ భాగ్య, పోలీస్ స్టోరీ 2, లాకప్ డెత్, సర్కిల్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ జైల్, మనే మనే రామాయణ తదితర చిత్రాలు బాక్సాఫీస్ ని కొల్లగొట్టాయి. ఇక తెలుగులో అమ్మ రాజీనామా, కర్తవ్యం, అంతఃపురం, ఈశ్వర్ అల్లా, జగద్గురు ఆది శంకర, ఎవడు, పటాస్, పండుగ చేస్కో, భలే మంచి రోజు, సరైనోడు, సుప్రీం, చుట్టాలబ్బాయి, జనతా గారేజ్, మనలో ఒకడు, ఓం నమో వెంకటేశాయ, జై లవకుశ, రాజా ది గ్రేట్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, మహర్షి, ఎస్ ఆర్ కళ్యాణమండపం, దసరా, సార్, ఇలా ఎన్నెన్నో చిత్రాల్లో నటించి మంచి పేరుని సంపాదించుకున్నారు.

WhatsApp Image 2025-01-10 at 12.01.27 (1).jpeg



2006లో సామాన్యుడు చిత్రంలోని పాత్రకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. 2010లో ప్రస్థానం చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు సాధించారు. సామాన్యుడు, ప్రస్థానం, రంగ్ తరంగ్ చిత్రాలలో నటనకు గాను ఫిలిం ఫేర్ అవార్డులు కైవసం చేసుకున్నారు. ప్రస్థానం సినిమాకు టీఎస్సార్-టీవీ 9 అవార్డును అందుకున్నారు.

WhatsApp Image 2025-01-10 at 12.01.27 (2).jpegWhatsApp Image 2025-01-10 at 12.01.26.jpeg

ఇక వెండితెరపైనే కాకుండా మాంచి కిక్కిచ్చే గేమ్ షో అంటూ బుల్లితెరపై ‘వావ్’ అనిపించుకున్నారు సాయి కుమార్. ప్రస్తుతం సాయి కుమార్ ఓ సినిమాలో నటిస్తే అది బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్టుగా మారిపోయింది. గత ఏడాది సాయి కుమార్ నటించిన కమిటీ కుర్రోళ్లు, సరిపోదా శనివారం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు సాయి కుమార్ ఇండస్ట్రీలో అందరికీ లక్కీ హ్యాండ్ అని అనిపించుకుంటున్నారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో సాయి కుమార్ ముందుంటారు. నటుడిగా యాభై ఏళ్లు పూర్తి అయినా కూడా లెక్కకు మించిన ప్రాజెక్టుల్లో భాగం అవుతూ బిజీగా ఉండటం ఒక్క సాయి కుమార్‌కే చెందింది. ఇక ఆయన కుమారుడిగా సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ సైతం చేతినిండా ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక సాయి కుమార్ మున్ముందు మరిన్ని చిత్రాలు, మంచి పాత్రలతో ఆడియెన్స్‌ను అలరిస్తూ ఉండాలని కోరుకుందాం.

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read-Game Changer Twitter Review: రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' ఎలా ఉందంటే.. ట్విట్టర్ రివ్యూ

Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 10 , 2025 | 12:26 PM