Sai Durga Tej: చిరుకి లైఫ్ టైమ్ ఎఛీవ్‌మెంట్.. తేజ్ స్పందన
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:21 PM
బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ తరఫున జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఆన మేనల్లుడు సాయిధుర్గా తేజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అక్కడి పార్లమెంట్ సభ్యులు, పలువురు మంత్రులు బుధవారం సన్మానించిన సంగతి తెలిసిందే! అక్కడి బ్రిడ్జ్ ఇండియా అనే సంస్థ తరఫున జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తూ ఆన మేనల్లుడు సాయిధుర్గా తేజ (Sai Durga teja) సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
‘‘పెదమామకు హృదయపూర్వక అభినందనలు. బ్రిడ్జ్ ఇండియా (bridge india Award) తరఫున లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న తొలి నటుడు ఆయనే కావడం సంతోషంగా ఉంది. యూకే పార్లమెంట్ సభ్యుల సత్కారాన్ని అందుకోవడం మాకెంతో గర్వంగా ఉంది. మాలో స్ఫూర్తి నింపుతున్నందుకు ధన్యవాదాలు మావయ్య’’ అని తేజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తేజ్ సంబరాల యేటి గట్టు సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈస్ట్ గోదావరిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.