Sai Durga Tej: మీ సాయం ఓ పాపకు బతుకునిస్తుంది..

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:15 AM

కాలేయ సమస్యతో (liver problem kid) బాధపడుతున్న ఓ చిన్నారికి తన వంతు సాయం చేశాడు. అలాగే మరికొందరు సాయం చేయాలని సోషల్‌ మీడియా ద్వారా అభ్యర్థించాడు.


మెగా మేనల్లుడు (Mega Hero) సాయి దుర్గ తేజ్‌ సేవా కార్యక్రమాల్లో మేనమావలకు ఏమాత్రం తీసిపోడు. కష్టం అని తెలిస్తే ఆపన్న హస్తం అందించక మానడు. సాయం కోరి వచ్చిన వారికి కూడా కాదన కుండా అండగా నిలుస్తున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా సహాయం కోరిన వారికి తన వంతు సహాయం చేస్తుంటాడు. ఇటీవల తన కోసం సినిమా సెట్‌కు వచ్చిన ఫ్యాన్స్‌ 350 మందికి ప్రత్యేకంగా భోజనం చేయించి మరీ కడుపు నింపి పంపాడు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు తేజ్‌. కాలేయ సమస్యతో (liver problem kid) బాధపడుతున్న ఓ చిన్నారికి తన వంతు సాయం చేశాడు. అలాగే మరికొందరు సాయం చేయాలని సోషల్‌ మీడియా ద్వారా అభ్యర్థించాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు తేజ్‌.  


Mad.jpg

‘హయా (Iqra Haya) అనే అమ్మాయి కాలేయ వ్యాధి బాధపడుతోంది. ప్రస్తుతం ఆ పాప జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. నా వంతుగా నేను ఆమె ట్రీట్‌మెంట్‌ కోసం సాయం చేశాను. దయచేసి మీరు కూడా ఎంతో కొంత డబ్బు సహాయంగా అందించండి. ప్లీజ్‌ మీరు చేసే సాయం వల్ల ఆ పాప ప్రాణాలతో ఉంటుంది. ప్రతి డొనేషన్‌ (Please Donate) చాలా ముఖ్యమైనది. ఆమె ఓ పోరాట యోధురాలు. మీరు సహాయం చేయడం వల్ల ఆ పాప సమస్య నుంచి బయటపడుతుంది’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు సాయి దుర్గ తేజ్‌. ప్రస్తుతం ఆయన 'సంబరాల ఏటిగట్టు' 9Sambarala Yetigattu) చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. రోహిత్‌ కె.పి దర్శకత్వంలో ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. బి. అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Jan 30 , 2025 | 11:15 AM