Gopichand 33: గోపీచంద్‌ కోసం అశోకవనంలో బ్యూటీ

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:15 AM

గోపీచంద్‌ (gopichand) హీరోగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి (Sankalp reddy) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది.  


గోపీచంద్‌ (gopichand) హీరోగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి (Sankalp reddy) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది.  త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌కి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం గోపీచంద్‌ (Gopichand 33) సరసన హీరోయిన్‌గా రితికా నాయక్‌ని (Rithika Nayak) ఎంచుకొన్నారు. బుధవారం ఇద్దరిపై ఫొటోషూట్‌ నిర్వహించారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో అలరించింది రితికి. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల మొదలైన వరుణ్‌ తేజ్‌ 15 చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రానిక ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఆ సినిమా మొదలైందో లేదో.. మరో ఛాన్స్‌ కొట్టేసింది రితికా నాయక్‌.  

Rithik.jpg

గోపీచంద్‌ 33వ సినిమా ఇది. సంకల్ప్‌ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. 7వ శతాబ్దంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజువల్స్‌, మేకింగ్‌ విషయంలో సంకల్ప్‌ ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇతర  విషయాలు తెలియాల్సి ఉంది.


ALSO READ: NBK: గోపీచంద్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బాలయ్య

RC16: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. టైటిల్ అదే..


Updated Date - Mar 27 , 2025 | 11:18 AM