RC16: రామ్‌చరణ్‌ కోసం పాత టెక్నాలజీ తీసుకొస్తున్నారు

ABN , Publish Date - Feb 02 , 2025 | 10:00 AM

పది, పదిహేనేళ్ల క్రితం సినిమా చిత్రీకరణ కోసం ఫిల్మ్‌ రీల్‌ని ఉపయోగించేవారు. అది బాగా ఖర్చుతో కూడిన విషయం. టేక్‌ల మీద టేకులు తీసుకుంటే ఫిల్మ్‌ చాలా వృథా అయ్యేది.


పది, పదిహేనేళ్ల క్రితం సినిమా చిత్రీకరణ కోసం ఫిల్మ్‌ రీల్‌ని (Film Camera technology) ఉపయోగించేవారు. అది బాగా ఖర్చుతో కూడిన విషయం. టేక్‌ల మీద టేకులు తీసుకుంటే ఫిల్మ్‌ చాలా వృథా అయ్యేది. అందుకే ఫిల్మ్‌ వేస్ట్‌ కాకూడదని నటీనటులు, దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటూ సింగిల్‌ టేక్‌లో సన్నివేశాల్ని పూర్తి చేేసందుకు ప్రయత్నించేవాళ్లు. ఇప్పుడంటా డిజిటల్‌ యుగం. డిజిటల్‌లో చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఫిల్మ్‌ కనుమరుగైంది, ఆ కెమెరాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడంతా కొత్త కెమెరాలు వచ్చాయి. చిత్రీకరణ కోసం అందరూ వాటినే వాడుతున్నారు. రికార్డింగ్‌ అంతా హార్డ్‌డిస్క్‌లో ఉంటుంది. ఇందులో ఎంతైనా షూట్‌ చేసుకోవచ్చు. (Ram Charan 16)




అయితే పాత టెక్నాలజీని మరోసారి తెరపైకి తీసుకురాబోతున్నారు దర్శకుడు బుచ్చిబాబు సాన(BuchiBabu Sana). రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం అప్పటి రీల్‌ కెమెరాని వినియోగిస్తున్నట్టు డిఓపీ రత్నవేలు (Dop Rathnavelu) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాలోని ప్రత్యేకమైన ఓ ఘట్టం కోసం పాత రోజులనాటి కొడక్‌ ఫిల్మ్‌ కెమెరాలో చిత్రీకరణ చేసి, ఆ తర్వాత దాన్ని డిజిటల్‌లోకి మార్చనున్నారు. పీరియాడిక్‌ కథతో రూపొందుతున్న చిత్రమిది. నాటి కాలంలో ఉన్నామనే అనుభూతి కోసమే ఈ ప్రయత్నమని తెలిపారు. రామ్‌చరణ్‌ సరసన జాన్వీకపూర్‌ (Janhvi kapoor) నటిస్తున్నారు.  జగపతిబాబు, శివ రాజ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలుపోషిస్తున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాం.

Updated Date - Feb 02 , 2025 | 10:13 AM