RC16 Alert: మ్యూజిక్‌ డైరెక్టర్‌పై రామ్‌చరణ్‌ టీమ్‌ క్లారిటీ

ABN , Publish Date - Jan 26 , 2025 | 11:21 AM

RC 16 గురించి తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సినిమా నుంచి రెహమాన్‌ తప్పుకొన్నారని, ఆ స్థ్థానంలో దేవిశ్రీ ప్రసాద్‌ వచ్చి చేరాడన్నది వార్తల సారాంశం

రామ్‌ చరణ్‌ (Ram Charan) - బుచ్చిబాబు (Buchchibabu) కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్‌ (janhvi kapoor) కథానాయికగా స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతోంది. ఈ చిత్రానికి రెహమాన్‌ని (AR Rahman) సంగీత దర్శకుడిగా ఎంచుకొన్నారు. ఇప్పటికే ఆయన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా పూర్తి చేశారు. తాజాగా ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ సినిమా నుంచి రెహమాన్‌ తప్పుకొన్నారని, ఆ స్థ్థానంలో దేవిశ్రీ ప్రసాద్‌ వచ్చి చేరాడన్నది వార్తల సారాంశం. 'ఉప్పెన’కు దేవిశ్రీ సంగీత దర్శకుడు. ఆ చిత్రం పెద్ద మ్యూజికల్‌ హిట్‌. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్‌తో రెహమాన్‌ని తప్పించి, దేవిశ్రీని లైన్‌లో పెట్టారని అనుకొన్నారు.

అయితే 'ఇది పెద్ద ఫేక్‌ వార్త. ఈ సినిమా నుంచి రెహమాన్‌ (Rahman) తప్పుకోలేదు. దేవిశ్రీ ప్రసాద్‌ రాలేదు. రెహమాన్‌ స్థానం అలానే వుంది’’ అని రామ్‌చరణ్‌ పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది. సినిమా పట్టాలెక్కకముందే రెహమాన్‌ 3 పాటలకు ట్యూన్లు ఇచ్చేశారు. మరో రెండు పాటలు మాత్రమే బాకీ. ఓ రకంగా చెప్పాలంటే రెహమాన్‌కు సంబంధించి సగం పని పూర్తయిపోయినట్టే. పైగా ఈ సినిమాకు రెహమాన్‌ కావాలని బుచ్చిబాబు కోరి మరీ ఎంచుకొన్నాడు. రెహమాన్‌తో నెలలపాటు ట్రావెల్‌ చేశాడు. అలాంటిది సడన్‌గా.. రెహమాన్‌ని పక్కన పెట్టాలనుకోవడం తొందరపాటే అవుతుంది. మరి ఈ ఫేక్‌ వార్త ఎలా పుట్టిందో? తెలియాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఉప్పెన చిత్రానికి ఇచ్చిన సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఇష్టంతో అభిమానులే అ వార్తలు పుట్టించారని టాక్‌. రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ పరిశీలనలో వుంది.

Updated Date - Jan 26 , 2025 | 11:21 AM