RC16: నెక్ట్స్‌ లెవల్లో గ్లింప్స్‌.. చొక్కాలు చింపుకోవడం ఖాయమట

ABN , Publish Date - Mar 23 , 2025 | 05:34 PM

చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ని విడుదల చేసి, లుక్‌ని రివీల్‌ చేద్దామనుకొంటున్నారట మేకర్స్‌. ఇప్పటికేఈ  గ్లింప్స్‌కు సంబంధించిన కట్‌ పూర్తయిందట.

ఈనెల 27న గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్‌ కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల చేేసందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సారా కలయికలో ఆర్‌సీ16 9RC16)తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కూడా బయటకు రాలేదు. చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ని విడుదల చేసి, లుక్‌ని రివీల్‌ చేద్దామనుకొంటున్నారట మేకర్స్‌. ఇప్పటికేఈ  గ్లింప్స్‌కు సంబంధించిన కట్‌ పూర్తయిందట. ఎడిట్‌ వెర్షన్‌ కొంతమంది చూశారు. చూసినవాళ్లంతా ‘నెక్ట్స్‌ లెవల్‌’ అంటూ ప్రశంసలు కురిపించారట. గ్లింప్స్‌ మామూలుగా లేదని, చరణ్‌ ఫ్యాన్స్‌ చొక్కాలు చింపుకోవడం ఖాయమని తెలుస్తోంది. ((Ram Charan birthday Special) అయితే పుట్టిన రోజున చరణ్‌ హైదరాబాద్‌లో ఉండడం లేదని, ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్తున్నారని తెలిసింది. ‘గేమ్‌ ఛేంజర్‌’ తరవాత.. చరణ్‌ నుంచి వస్తున్న సినిమా ఇది.  గేమ్‌ ఛేంజర్‌ ఫెయిల్యూర్‌తో చరణ్‌కి విమర్శించిన వారికి సమాధానం చెప్పేలా బుచ్చిబాబు గ్లింప్స్‌ డిజైన్‌ చేశార్ట. రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే పీరియాడికి డ్రామాలో జాన్వీ కపూర్‌ కథానాయిక. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 05:34 PM