Ravi Teja: ఆ దర్శకుడితో రవితేజ సినిమా ఫిక్స్
ABN , Publish Date - Feb 08 , 2025 | 01:18 PM
గత ఏడాది రవితేజ మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ ఏడాది ఆయన చేతిలో ఒకటే సినిమా ఉంది. రవితేజ చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా ఉంది. ఆ సినిమా తర్వాత సినిమా ఏంటి? అన్నది ఇప్పుడు చర్చగా మారింది.
రవితేజ (Ravi Teja) ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదికి మూడు సినిమాలు చేస్తే సత్తా ఉన్న నటుడు ఆయన. గత ఏడాది మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఈ ఏడాది ఆయన చేతిలో ఒకటే సినిమా ఉంది. రవితేజ చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా ఉంది. ఆ సినిమా తర్వాత సినిమా ఏంటి? (Ravi Teja update) అన్నది ఇప్పుడు చర్చగా మారింది. సెట్స్ మీదు ఒకటే సినిమా ఉన్నా.. క్యూలో ఓ దర్శకుడు ఉన్నారు. ఆయన చెప్పిన కథను రవితేజ ఓకే చేశారు. (Ravi Teja next movie)
కిశోర్ తిరుమల దర్శకత్వంలో...
రవితేజతో (Ravi Teja) కిషోర్ తిరుమల ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయి. కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకుడు మాత్రమే కాదు... మంచి రచయిత కూడా. రామ్ పోతినేని (Rami Pothineni)హీరోగా దర్శకత్వం వహించిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగి’, సాయితేజ్ హీరోగా తీసిన ‘చిత్రలహరి’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. శర్వానంద్, రష్మిక జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ ఒక వర్గం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కిషోర్ తిరుమల రచన, దర్శకత్వం మీద రవితేజకు మంచి అభిప్రాయం ఉంది. పైగా, ‘పవర్’ సినిమా రైటింగ్ టీంతో కిషోర్ తిరుమల ట్రావెల్ చేశారు. కొన్ని రోజుల క్రితం రవితేజను కలిసి ఆయన ఒక కథ చెప్పడం, దానికి మాస్ మహారాజ్ ఓకే చేయడం జరిగాయి. ఆల్రెడీ స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. ఈ సినిమా నిర్మాత ఎవరనేది త్వరలోనే బయటకు రానుంది. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ షూటింగ్ జరుగుతోంది. మార్చి నెలకి ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత కిషోర్ తిరుమల సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని రవితేజ డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ సెకండాఫ్ లేదా మే నెలల్లో సినిమా షూటింగ్ మొదవలయ్యే అవకాశం ఉంది.