Rashmika Mandanna: ఆ క్రెడిట్‌ ఆయనకు దక్కాల్సిందే.. కానీ..

ABN , Publish Date - Feb 09 , 2025 | 04:33 PM

కాలికి చిన్న గాయమై రష్మిక కాస్త రెస్ట్‌లో ఉన్నారు. దాంతో శనివారం జరిగిన ‘పుష్ప 2 ది రూల్‌’ (Pushpa 2) థ్యాంక్స్‌ మీట్‌కు హాజరుకాలేకపోయింది. దీంతో చిత్రబృందాన్ని ఉద్దేశించి నేషనల్‌ క్రష్‌ రష్మిక (rashmika) ధన్యవాదాలు చెప్పారు.



కాలికి చిన్న గాయమై రష్మిక కాస్త రెస్ట్‌లో ఉన్నారు. దాంతో శనివారం జరిగిన ‘పుష్ప 2 ది రూల్‌’ (Pushpa 2) థ్యాంక్స్‌ మీట్‌కు హాజరుకాలేకపోయింది. దీంతో చిత్రబృందాన్ని ఉద్దేశించి నేషనల్‌ క్రష్‌ రష్మిక (rashmika) ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేసింది.

‘‘శనివారం జరిగిన పుష్ప 2 (Pushpa 2) థాంక్యూ మీట్‌లో నేను పాల్గొనలేకపోయా. కాకపోతే నేడు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. సుకుమార్‌ సర్‌, అల్లు అర్జున్‌, మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థకు థాంక్యూ. మీరెంతో శ్రమించి మాకు ఇలాంటి మాస్టర్‌పీస్‌ను అందించినందుకు ఒక ప్రేక్షకురాలిగా ధన్యవాదాలు. అలాగే, శ్రీవల్లి గా చెప్పాలంటే మీకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాని తెరకెక్కించడంలో అన్ని విబాగాలు అద్భుతంగా వర్క్‌ చేశాయి. ఈ ప్రయాణంలో నన్ను భాగం చేసినందుకు, నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రత్యేకమైన రోల్‌ ఇచ్చినందుకు థాంక్యూ’’ అని ఆమె పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా ‘పుష్ప: 2 ది రూల్‌’ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రష్మిక కథానాయిక. ఈ సినిమా గత డిసెంబరులో విడుదలై భారీ హిట్‌ అయింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం శనివారం రాత్రి హైదరాబాద్‌లో థ్యాంక్స్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ‘‘ఈ సినిమా పోస్టర్‌పై నా బొమ్మ చూసుకున్న ప్రతిసారీ ఎంత అదృష్టమో అనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ వల్లే ఈ చిత్రం సాధ్యమైంది. దర్శకుడు సుకుమార్‌ ఓ విజయంలోని క్రెడిట్‌ను తాను తీసుకోకుండా అందరికీ పంచేస్తుంటాడు. కానీ, నిజంగా ఈ విజయంలోని పూర్తి క్రెడిట్‌ తనకే సొంతం’’ అని అన్నారామె. 

Updated Date - Feb 09 , 2025 | 04:33 PM