Rashmika Mandanna: హీరోయిన్ రష్మికకు తీవ్ర గాయం.. ఆందోళనలో అభిమానులు
ABN , Publish Date - Jan 22 , 2025 | 11:48 AM
Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందున్నకు తీవ్ర గాయం అయ్యింది. ప్రస్తుతం ఆమె నడవలేని స్థితిలో ఉన్నారు. దీంతో ఆమె తొందరగా రికవరీ కావాలని ప్రార్థిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
టాలీవుడ్ బ్యూటీ, టాప్ హీరోయిన్ రష్మిక మందన్న గాయపడ్డారు. తాజాగా ఆమె హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో గాయంతో కనిపించారు. దీంతో ఈ సన్నివేశాలు నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. తొందరగా ఆమె కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. అసలు రష్మికకు గాయం ఎప్పుడు, ఎలా జరిగింది అంటే..
హీరోయిన్ రష్మిక మందన్న బుధవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో వీల్ చైర్ లో కనిపించారు. ఆమె కారులో నుండి దిగేటప్పుడు నడవలేకపోయారు. ఆమె సిబ్బంది సహాయంతోనే వీల్ చైర్ పై కూర్చున్నారు. మొహానికి మాస్క్, తలకు క్యాప్ పెట్టుకొని ఆమె తనని తాను కవర్ చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంతకీ తనకు గాయం ఎలా ఏర్పడిందంటే.. కొన్ని రోజుల క్రితం జిమ్ చేస్తుండగా రష్మిక కాలు బెణికింది. తర్వాత ఆ గాయం తీవ్రంగా మారింది. దీంతో ఆమె చికిత్స తీసుకుంటున్నారు.
రీసెంట్ గా 'పుష్ప 2'తో సక్సెస్ అందుకున్న రష్మిక ప్రస్తుతం విభిన్నమైన ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. ప్రస్తుతం.. విక్కీ కౌశల్ 'ఛావా'తో పాటు సల్మాన్ ఖాన్ 'సికందర్', శేఖర్ కమ్ముల 'కుబేర', రాహుల్ రవీంద్రన్ 'ది గర్ల్ ఫ్రెండ్', 'తామా' వంటి చిత్రాలలో నటిస్తూ నంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్నారు.