Rashmika Mandanna: రష్మిక మాటలకు అర్ధాలే వేరులే అంటున్న నెటజన్లు

ABN , Publish Date - Jan 28 , 2025 | 10:44 AM

రష్మిక మాట్లాడుతూ ‘‘నాకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం ఏది అంటే ఇల్లు అనే చెబుతాను. ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. పాజిటివ్‌ వైబ్స్‌ ఉంటాయి. ఎక్కడ పొందలేని ఆనందం ఇంట్లో లభిస్తుంది

'పుష్ప-2’ (Pushpa2) సక్సెస్‌ జోరులో ఉన్న రష్మిక మందన్నా (Rashmika Mandanna) వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో కలిసి ‘ఛావా’తో (Chaavva) సందడి చేయనున్నారు. లక్ష్మణ్‌ ఉటేకర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ ‘‘నాకు ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం ఏది అంటే ఇల్లు అనే చెబుతాను. ఇంట్లో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. పాజిటివ్‌ వైబ్స్‌ ఉంటాయి. ఎక్కడ పొందలేని ఆనందం ఇంట్లో లభిస్తుంది (Home is my happy place). ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ నేను ఒక కుమార్తె, సోదరి, భాగస్వామిగా నా జీవితాన్ని గౌరవిస్తాను.  అది పూర్తిగా నా వ్యక్తిగత జీవితం’’ అని అన్నారు. ఇక ఎదుటి వ్యక్తిలో తనను ఆకర్షించే విషయాల గురించి మాట్లాడుతూ.. ‘‘కళ్లు మన మనసుకు ప్రతిబింబాలు. కళ్ల తో పలికించే హావభావాలను నేను నమ్ముతాను. నవ్వుతూ ఉండే వ్యక్తులను ఇష్టపడతాను. అలాగే ఎదుటి వారిని గౌరవించే వారంటే నాకు ఇష్టం’’ అని అన్నారు.


Rashmika.jpg

ఇక రష్మిక (Rashmika) భాగస్వామి గురించి మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రిలేషన్‌లో ఉన్నారా అని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. అంతే కాదు.. నెటిజన్లు మరో కామెంట్‌ కూడా చేశారు. ఈ మధ్యకాలంలో రష్మిక ప్రతి పండుగను విజయ్‌ దేవరకొండ ఇంట్లో సెలబ్రేట్‌ చేసుకుందని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టిన ఫొటోలు చెప్పాయి. దీనిని ఉద్దేశించి మీకు ఆనందాన్ని ఇచ్చేది విజయ్‌ దేవరకొండ ఇల్లా అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. ఇద్దరూ టూర్లు కూడా వేస్తుంటారు. అయితే ఇద్దరిలో ఎవరూ రిలేషన్‌ గురించి మాట్లాడలేదు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌ నటి అనన్య పాండే పరోక్షంగా హింట్‌ ఇచ్చారు. అప్పటినుంచి ఈ వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. తాజాగా రష్మిక భాగస్వామి గురించి చెప్పడంతో మరోసారి ఈ జంట టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ర్టీగా మారింది.  

Updated Date - Jan 28 , 2025 | 12:11 PM