Mahesh Babu: రామ్ మూవీ కోసం 34 రోజుల పాటు డే అండ్ నైట్ షూట్
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:05 AM
రామ్ పోతినేని, భాగశ్రీ బోర్సే జంటగా మైత్రీ మూవీమేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాకు మహేశ్ బాబు పి దర్శకుడు.
ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' (Miss Shetty Mr. Polishetty) విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి (Mahesh Babu P) దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది.
రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది చిత్ర బృందం. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది. రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) సహా రావు రమేష్ (Rao Ramesh), మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితర తారాగణం మీద సినిమా చిత్రీకరించారు. మార్చి 28వ తేదీ నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.
Also Read: Sobhita Dhulipala: మా ఆయన బంగారం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి