Peddi Movie: శ్రీరామనవమికి మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌..

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:05 PM

రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్‌ను రివీల్‌ చేశారు.


రామ్‌చరణ్‌ (Ram charan) హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామ్‌చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని టైటిల్‌ను రివీల్‌ చేశారు. ఈ చిత్రానికి 'పెద్ది’ (Peddi) అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఆదివారం ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ టీమ్‌ ఈ చిత్రంలోని రామ్‌చరణ్‌ కొత్త లుక్‌ను విడుదల చేసి ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌ వీడియో గురించి అప్‌డేట్‌ ఇచ్చారు.

pEddi.jpg

శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ ఆరో తేదిన ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌ వీడియో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. వృధ్ది సినిమాస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ.ఆర్‌ రహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. 

Updated Date - Mar 30 , 2025 | 04:05 PM