RC16: రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. టైటిల్ అదే..
ABN , Publish Date - Mar 27 , 2025 | 09:41 AM
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'ఆర్ సి 16' సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న 'ఆర్ సి 16' సినిమా గురించి ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఉప్పెన తో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ‘RC16’ నుంచి అప్‌డేట్ వచ్చింది. చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి విషెస్ చెప్పింది. మొదటి నుంచి ప్రచారంలో ఉన్నట్టే ఈ సినిమాకు ‘పెద్ది’ (Peddi) అనే టైటిల్ ఖరారు చేశారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతుంది. ‘ఉప్పెన’ (Uppena) తర్వాత బుచ్చిబాబు చేస్తున్న చిత్రమిది. రామ్‌చరణ్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండనుంది. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. శివ రాజ్‌కుమార్‌తోపాటు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. చరణ్ కెరీలో బెస్ట్ సినిమాగా నిలుస్తుందని అయన ఒక వేదికపై చెప్పిన సంగతి తెల్సిందే.