Ram Pothineni: నిన్న విశ్వక్... నేడు రామ్... భలే ఉంది వరుస!
ABN , Publish Date - Feb 28 , 2025 | 10:56 AM
యంగ్ హీరోస్ ఒక్కొక్కరూ తమలోని హిడ్డెన్ టాలెంట్ ను బయటపెడుతున్నారు. నిన్న 'లైలా' మూవీలో సోనూ మోడల్ అనే గీతాన్ని విశ్వక్ సేన్ రాయగా, తాజాగా రామ్ పోతినేని తన సినిమా కోసం ఓ ప్రేమగీతాన్ని రాసేశాడు.
మన యంగ్ హీరోస్ మల్టీటాలెంటెడ్! ఎందుకంటే... నటనతో పాటుగా వాళ్ళు మరో రెండు మూడు విభాగాల్లోనూ తమ ప్రతిభను చూపుతూ ఉంటారు. నిజానికి ఈ టాలెంట్ తెలుగు సినిమారంగంలోని కథానాయకులకు మొదటి నుండి ఉన్నదే. కాకపోతే... మధ్యలో కొందరు మాత్రం ఇతరు విభాగాల్లో మనం వేలెందుకు పెట్టాలనే ఆలోచనతో దూరంగా ఉండేవాళ్ళు. చాలామంది హీరోలు నిర్మాతలుగా మారిన తర్వాత తమ ప్రతిభను ఇందులో వేరే వేరే శాఖల్లోకి విస్తరిస్తూ ఉంటారు. కొందరు కొరియోగ్రఫీ చేస్తే, మరికొందరు యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుంటారు. ఇంకొందరు హీరోలైతే ఎడిటింగ్ మీద గ్రిప్ సంపాదించుకుని తమ సినిమాల ఎడిటింగ్ సమయంలో పక్కనే కూర్చుని సజెషన్స్ ఇస్తుంటారు. కానీ చాలామంది హీరోలు చేసే కామన్ థింగ్ ఏమిటంటే... పాట పాడేయడం. తెలుగులో అగ్ర కథానాయకులే కాదు యంగ్ హీరోలు కూడా చాలామంది తమ సినిమాల్లో పాటలు పాడేశారు.
విశేషం ఏమంటే... ఇప్పటి యంగ్ హీరోస్ పాటలు పాడటం కాదు... పాటలు రాయడం కూడా చేస్తున్నారు. నిన్నటికి నిన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తన తాజా చిత్రం 'లైలా' (Laila) మూవీలోని 'సోనూ మోడల్' అనే పాటను రాసేశాడు. దీనిని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనుకోవచ్చు. అయితే ఆ సినిమా ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో విశ్వక్ సేన్ ఇక మీదట ఇలాంటి సినిమాలు చేయలేనని, తన చిత్రాలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ కు ఆస్కారం ఇవ్వనని అభిమానులకు ఓపెన్ లెటర్ రాశాడు. ఈ సంగతి పక్కనపెడితే... హీరో రామ్ పోతినేని (Ram Pothineni) తన కొత్త సినిమాలో ఓ ప్రేమగీతాన్ని రాసేశాడట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ రామ్ హీరోగా మహేశ్ బాబు పి. దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తోంది. భాగ్యశ్రీ బోర్సే (Bhagyasri Borse) ఇందులో హీరోయిన్. మరి పాటరాసి ఊరుకుంటాడా... లేకపోతే రామ్ ఈ పాటను కూడా పాడేస్తాడా? అనేది చూడాలి. అన్నట్టు ఈ సినిమా ద్వారా తమిళ సంగీత ద్వయం వివేక్, మెర్విన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
Also Read: Bollywood Actress: పరిణీతీ చోప్రా మొదలెట్టేసింది...
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి