Ram Gopal Varma: ఫ్యాన్స్‌ని ఏడిపించేసిన ఆర్జీవీ.. కంబ్యాక్ స్ట్రాంగర్ వర్మ

ABN , Publish Date - Jan 21 , 2025 | 06:43 AM

Ram Gopal Varma: అల్ టైమ్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కంటే రామునే ఎక్కువగా కీర్తించేవారు. అనురాగ్ కశ్యప్ 'గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్' వంటి చిత్రాల నుండి నేటి 'ఎనిమల్', కేజీఎఫ్ వంటి అనేక గ్యాంగ్ స్టార్ చిత్రాలకు ఆర్జీవీ అల్ టైమ్ క్లాసిక్ 'సత్య' సినిమానే ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Rgv's Emotional tweet

రాంగోపాల్ వర్మ.. ఈ పేరంటే చాలా మందికి చాలా రకాల ఫీలింగ్స్ వస్తుంటాయి. ఒక రకంగా అది అయినా సక్సెస్ అనే చెప్పొచ్చు. ఇక సినిమాల పరంగా చూసుకుంటే ఆయన 2006 వరకు చేసినవన్నీ క్లాసిక్ సినిమాలే. ఒక రకంగా చెప్పాలంటే మూస పద్ధతితోలో నడుస్తున్న ఇండియన్ సినిమాని దారుణంగా హేళన(క్రిటికల్‌గా) చేసి ఒక కొత్త రూపాన్ని అందించి 'దౌడ్' పెట్టించాడు. అల్ టైమ్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కంటే రామునే ఎక్కువగా కీర్తించేవారు. అనురాగ్ కశ్యప్ 'గ్యాంగ్స్ ఆఫ్ వసిపూర్' వంటి చిత్రాల నుండి నేటి 'ఎనిమల్', కేజీఎఫ్ వంటి అనేక గ్యాంగ్ స్టార్ చిత్రాలకు ఆర్జీవీ అల్ టైమ్ క్లాసిక్ 'సత్య' సినిమానే ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.


తాజాగా 'సత్య' సినిమా 27 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ముంబైలో రీ రిలీజ్ చేశారు. అర్జీవితో పాటు సత్య టీమ్ అంత కలిసి ఈ సినిమాని వీక్షించారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీ ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ పెట్టారు ఇప్పుడు అది ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. ట్రూ ఆర్జీవీ ఫ్యాన్స్ ఆ ట్వీట్ చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఇంతకీ వర్మ ఏమన్నాడంటే..


ఆయన ట్వీట్ చేస్తూ .. ‘‘27 ఏళ్ల తర్వాత మొదటిసారి ‘సత్య’ చూశాను. నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. ఎందుకంటే కేవలం సినిమా కోసం కాదు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు గుర్తొచ్చాయి. ఒక సినిమాను చిత్రీకరించడమంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. సినిమా తీసిన తర్వాత ఇతరులు దాని గురించి ఏం చెబుతారనేది కూడా ముఖ్యమే. నేను తీసిన చిత్రాలు హిట్‌ అయినా.. కాకపోయినా.. నేను పనిలో నిమగ్నమై ముందుకుసాగుతున్నాను. రెండు రోజుల క్రితం ‘సత్య’ సినిమా చూసినప్పుడు ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన తర్వాత నేను ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని అనిపించింది. అలాగే ఈ చిత్రంలోని భావోద్వేగం వల్ల నాకు కన్నీళ్లు రాలేదు. ఇంత గొప్ప జానర్‌ సినిమాను నేనే తీశాను అనే ఆనందానికి వచ్చాయని అర్థమైంది. ‘సత్య’ లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాననే అపరాధభావంతో నాకు కన్నీళ్లు వచ్చాయి’’

‘‘నేను తాగుబోతును అయ్యాను. మద్యంతోనే కాదు, సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారంతో నా కళ్లునెత్తికెక్కాయి. సత్య’ గొప్పతనం రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసేవరకూ అర్థం కాలేదు. రంగీలా, సత్యలాంటి చిత్రాలు ఇచ్చిన వెలుగులో నా కళ్లు మూసుకుపోయాయి. దీంతో నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ప్రేక్షకులను ఏదో ఆశ్చర్య పరచాలని, గిమ్మిక్కులతో ఆకట్టుకోవాలని, నాకున్న అతి తెలివితో అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు, ఇలా అర్థంపర్థంలేని విషయాలతో కథ, కథనాలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా సినిమాలు తీశా. సాధారణ కథతోనూ మంచి ఎలివేషన్‌ ఉన్న సినిమాలు చేయొచ్చు. కానీ, నేను అలా చేయలేకపోయాను. నేను ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను. కానీ, సత్యలో ఉన్న గొప్పతనం వాటిలో లేదు. నా ప్రతిభకు ఇండస్ట్రీ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ, నేను వాటిని చూడలేకపోయాను. నేను ఇప్పటివరకు చేసిన వాటిని సరిదిద్దుకోలేను. అందుకే నా కన్నీళ్లను తుడుచుకుంటూ 2 రోజుల క్రితం ఓ వాగ్దానం చేసుకున్నాను. ఇకపై నేను చేసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిర్ణయించుకున్నా. ‘సత్య’ లాంటి సినిమాను మరోసారి తీయలేకపోవచ్చు. కనీసం ఆ జానర్‌ సినిమాలైనా తీయలేకపోతే నేను సినిమాలకు ద్రోహం చేసినవాడిని అవుతాను’’

‘‘సత్య’ తీసిన తర్వాత నేను ఎన్నో సినిమాలు చేశాను. అవి కూడా ‘సత్య’ అంత బాగుంటాయా అని నన్ను ఎవరూ అడగలేదు. కనీసం ఇలా నన్ను నేను కూడా ప్రశ్నించుకోలేకపోవడం దారుణం. ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు ‘సత్య’ను కచ్చితంగా చూడాలనే నియమాన్ని పెట్టుకున్నాను. ఇప్పటివరకు తీసిన చిత్రాలకు ఈ నియమాన్ని పాటించినట్లైతే 90 శాతం చిత్రాలు తెరకెక్కించేవాడిని కాదేమో. చివరగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా జీవితంలో ఇంకా సగభాగం మిగిలే ఉంది. దానిని గౌరవంగా పూర్తిచేయాలనుకుంటున్నా. సత్య లాంటి సినిమాలను తెరకెక్కించాలనుకుంటున్నాను. ఇదే సత్యం. ఈ సత్యాన్ని నా సినిమా ‘సత్య’పై ప్రమాణం చేసి చెబుతున్నాను’’ అని పేర్కొన్నారు.


ఈ ట్వీట్ కి బాలీవుడ్ దిగ్గజ నటుడు, 'సత్య'లో కీలక పాత్రలో నటించిన మనోజ్ బాజ్‌పేయ్ స్పందిస్తూ.. "నీలాంటి జీవితాన్ని కొనసాగించాలంటే.. నీ మాదిరిగా వర్క్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. భయం లేకుండా నీవు పనిచేసే తీరు మాటల్లో చెప్పలేం. అందుకే ప్రతీ ఒక్కరి రాం గోపాల్ వర్మ కాలేరు. మీరు మీకే సాటి. మీ టాలెంట్ ఎవరికీ లేదు. వైవిధ్యంతో కూడిన అరుదైన జీవివి మీరు. మీతో ట్రావెల్ అయ్యే అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్" అంటూ ట్వీట్ చేశాడు.


మనోజ్ బాజ్‌పేయ్ ట్వీట్‌కు ఆర్జీవి స్పందిస్తూ.. " వెల్ బీకూ బాయ్.. థ్యాంక్స్. నేను నీకు ఇప్పటికే ప్రామిస్ చేసినట్టు.. మీరు బ్రాండ్ న్యూ వర్మను చూస్తారు. అలా నేను చేయకపోతే.. నేను ఫెయిల్ అయితే.. నా తలపై పిస్టల్ గురిపెట్టి షూట్ చేసి చంపేయ్" అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నిజమైన ప్రేమికుల ఆనంద బాష్పాలు కారుస్తున్నారు.


Also Read-Pushpa 2: సంధ్యలో పుష్ప గాడి ర్యాంపేజ్..

Also Read-Chiranjeevi - Venkatesh: చిరంజీవి తర్వాత వెంకటేష్..

Also Read-Hari Hara Veera Mallu: పవన్ అంటే భయం లేదా..

Also Read-Balakrishna: బాలయ్య సెంటి‌‌మెంట్ ఏంటో తెలుసా

మా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 21 , 2025 | 07:09 AM