Ram Gopal Varma: తగ్గిన వర్మ.. మాటపై నిలబడతాడా

ABN , Publish Date - Feb 07 , 2025 | 08:04 AM

దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్, వర్మకు జైలు శిక్ష అంటూ మనం రెగ్యులర్‌గా వార్తలు చూస్తూనే ఉన్నా ఆయన మాత్రం కనీసం పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళలేదు. అయితే వర్మ తనంతటా తానే పోలీసు స్టేషన్‌కు హాజరవుతానని పోలీసులకు చెప్పాడు. మరి శుక్రవారం పోలీసుల ముందుకు వర్మ హాజరు కానున్నాడా అనేది ఉత్కంఠగా మారింది.

RGV

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Ram Gopal Varma) శుక్రవారం పోలీసు విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఒంగోలులో రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై నమోదైన కేసుపై విచారణ జరగనుంది. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని సీఐ శ్రీకాంత్ ఇటీవల నోటీసు జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరవుతానని విచారణాధికారి సీఐ శ్రీకాంత్ వర్మ సమాచారం ఇచ్చారు.


కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీస్ విచారణకు హాజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్టే చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూనే.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.

Also Read-Sonu Sood: ‘‘సోనూ సూద్‌‌ను అరెస్ట్ చేయండి’’


రాంగోపాల్ వర్మ గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం.. ఆయన డుమ్మా కొట్టడం జరుగుతూ వచ్చాయి.. తాజాగా ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఆర్జీవీ.. 7న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజైనా వర్మ.. పోలీసుల విచారణకు హాజరవుతారా.. లేదా.. ఇంకా ఏదైనా కారణం చూపి.. చివరి నిమిషంలో డుమ్మా కొడతారా.. అనేది ఉత్కంఠగా మారింది.

Also Read-Thandel 'X' Review: నాగ చైతన్య 'తండేల్'పై ఆడియెన్స్ ఒపీనియన్ ఇదే..

Also Read- Madhavan: కొంపముంచిన ఏఐ.. మాధవన్‌కు అనుష్క కాల్

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 07 , 2025 | 08:08 AM