Ram Charan: బుచ్చి బాబు 'మల్టీ గేమ్'.. తారక్ ప్రాజెక్ట్ ఇదే

ABN , Publish Date - Jan 22 , 2025 | 11:07 AM

Ram Charan: ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా తెరపైకి రావడంతో మరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలోసి ఫ్యాన్స్ మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఇంతకీ రామ్ చరణ్ 'RC 16' టైటిల్ ఏంటి? దీనికి తారక్‌కి సంబంధం ఏంటి? అసలు బుచ్చి బాబు ఆడిస్తున్న 'మల్టీ గేమ్' ఏంటంటే..

Charan bagging NTR's project

గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సాన (Sana Buchibabu) తెరకెక్కిస్తున్న 'ఆర్‌సీ16’ (RC 16) టైటిల్ ఫిక్స్ అయినట్లు వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే అవుతున్నాయి కానీ.. ఆ టైటిల్ రివీల్ కావడం సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు కారణమవుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా తెరపైకి రావడంతో మరో ఫ్యాన్స్ సోషల్ మీడియాలోసి ఫ్యాన్స్ మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఇంతకీ రామ్ చరణ్ 'RC 16' టైటిల్ ఏంటి? దీనికి తారక్ కి సంబంధం ఏంటి? అసలు బుచ్చి బాబు ఆడిస్తున్న 'మల్టీ గేమ్' ఏంటంటే..


'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత తారక్.. బుచ్చి బాబుతో ఒక మూవీ చేయాల్సి ఉంది. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ వర్క్ కూడా షురూ అయినట్లు వార్తలు వచ్చాయి. తారక్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు అని వార్తలు పబ్లిష్ అయ్యాయి. అలాగే ఇదొక స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఆ వార్తల్లో వచ్చింది. కానీ.. తర్వాత ఏమైందో ఏమో కాని ఎన్టీఆర్ ఆ ప్రాజెక్ట్ చేయలేదు. బుచ్చి బాబు.. చరణ్ తో ఇంకో ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటున్నాడు అనుకున్నారు అంత. కానీ.. జరిగింది వేరు.


ఇటీవల 'RC 16' మూవీ యూనిట్ కర్ణాటకలో షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ షెడ్యూల్ షూట్ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే.. ఈ షూటింగ్ లో జాన్వీ కూడా జాయిన్ అయ్యారు. ఈ సినిమా కూడా స్పోర్ట్స్ డ్రామానే. అయితే ఇది కాదు అసలు మేటర్. ఈ సినిమా టైటిల్ 'పెద్ది' అని బయటకు వార్తలు వచ్చాయి. దీంతో ఇది ఎన్టీఆర్ తో చేయాల్సిన ప్రాజెక్టే అని ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. అప్పట్లో బుచ్చి బాబు, తారక్, జాన్వీల మూవీ నేమ్ 'పెద్ది' అని టాక్ వినిపించింది. ఫైనల్ గా విషయం ఏంటంటే ఇది బుచ్చి బాబు.. తారక్ తో చేయాల్సిన సినిమానే.. కానీ ఎందుకో చివరకు చరణ్ చేతిలో పడింది. ఈ నేపథ్యంలోనే చెర్రీ, తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మినీ వార్ స్టార్ చేసుకున్నారు. కొన్ని ప్రాజెక్ట్ లు చేతులు మారడం సాధారణమే.. మరి ఇందులో బుచ్చి బాబు 'మల్టీ గేమ్' ఏంటి అంటారా..


ఈ సినిమా ఒక గేమ్ బేస్డ్‌గా కాదు.. రెండు ఆటల నేపథ్యంలో తెరకెక్కనుందట. ఇందులో జాన్వీ కూడా అథ్లెట్‌గా కనిపించే అవకాశం ఉంది. ఇదే బుచ్చి బాబు అసలైన 'మల్టీ గేమ్'. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీకపూర్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read- IT Raids: లెక్కలు తేల్చాల్సిందే.. కొనసాగుతున్న ఐటీ దాడులు

Also Read- Rashmika Mandanna: పెరుగుతున్న రష్మిక ఆధిపత్యం.. శ్రీవల్లికి మరో ఛాలెంజ్

Also Read- Akhanda 2: 'కుంభమేళా'లో అఖండ షూటింగ్ ఎందుకు.. అక్కడ అయిపోయింది కదా

Also Read-Anirudh: తెలుగులో అనిరుధ్ మోత.. పెద్ద సినిమాలన్నీ

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 22 , 2025 | 11:12 AM