RC16: రామ్‌చరణ్‌ షురూ చేశారు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 10:35 AM

ఈ సంక్రాంతి బరిలో గేమ్‌ ఛేంజర్‌తో (Game Changer) ప్రేక్షకుల ముందుకొచ్చారు గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan). తదుపరి ఆర్‌సీ16 (Rc16) పై ఆయన దృష్టి సారించనున్నారు.

ఈ సంక్రాంతి బరిలో గేమ్‌ ఛేంజర్‌తో (Game Changer) ప్రేక్షకుల ముందుకొచ్చారు గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram charan). తదుపరి ఆర్‌సీ16 (Rc16) పై ఆయన దృష్టి సారించనున్నారు. బుచ్చిబాబు సానా (Buchi Babu) తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలతో కలిసి వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్‌ కథానాయిక. ఇప్పటికే మైసూర్‌లో ఓ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం  బుధవారం నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించుకోనుంది. రాత్రి వేళ సాగే ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తోపాటు ప్రధాన తారలపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ను సిద్థం చేసినట్లు తెలిసింది. ఓ ఆటతో ముడిపడి ఉన్న బలమైన భావోద్వేగాలతో నిండిన కథతో.. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి  ‘పెద్ది’ అనే పేరు పరిశీలనలో ఉంది. కన్నడ శివ రాజ్‌కుమార్‌, జగపతిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం మట్టిలాంటిదని, తన గత చిత్రాలతో కంపేర్‌ చేస్తే ఇదే ది బెస్ట్‌ చిత్రమవుతుందని రామ్‌చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే! ఉప్పెన బ్లాక్‌బస్టర్‌ తర్వాత సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.  ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడు. రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Jan 28 , 2025 | 10:35 AM