Ram Charan: ఢిల్లీలో రామ్‌చరణ్ ఏం చేయబోతున్నారంటే
ABN , Publish Date - Feb 24 , 2025 | 05:23 AM
రామ్‌చరణ్ (Ram CHaran) దర్శకుడు బుచ్చిబాబు సానా(Sana Buchibabu) కలయికలో ఓ స్పోర్ట్స్ డ్రామా (Sports Drama) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
రామ్‌చరణ్ (Ram CHaran) దర్శకుడు బుచ్చిబాబు సానా(Sana Buchibabu) కలయికలో ఓ స్పోర్ట్స్ డ్రామా (Sports Drama) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, వృద్థి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్ళలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయిక. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా చరణ్ – దివ్యేందులపై క్రికెట్ నేపథ్య సన్నివేశాలు తెరకెక్కించారు. కాగా, తదుపరి షెడ్యూల్ మార్చి తొలి వారం నుంచి ఢిల్లీలో మొదలు కానుందని సమాచారం. ఆ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌తో పాటు ప్రధాన తారాగణంపై కుస్తీ నేపథ్య సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.
కథ పరంగా ఈ సినిమాలో క్రికెట్, కుస్తీతోపాటు మరికొన్ని ఆటలకు ప్రాధాన్యముంది. చరణ్ దీంట్లో అందర్నీ ఆశ్చర్యపరిచేలా ఓ కొత్త క్యారెక్టరైజేషన్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే పేరుతో పాటు మరో రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. మార్చి 27న రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదలయ్యే అవకాశముంది. ఈ చిత్రానికి రెహమాన్ సంగీత దర్శకుడిగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.