Ram Charan: ఉపాసనలో నచ్చని విషయం అదే.. చరణ్ అన్నీ చెప్పేశాడు..
ABN , Publish Date - Jan 17 , 2025 | 02:43 PM
ఉపాసనలో రామ్ చరణ్ కు నచ్చిన విషయాలేంటి.. నచ్చని విషయాలేంటి? పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా ఫిలిం ఎంట్రీ గురించి రామ్ చరణ్ ఎం చెప్పారు.
బాలకృష్ణ (Bala Krishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షోలో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. తాజా ఎపిసోడ్‌లో గ్లోబల్‌స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన రెండో భాగం విడుదలైంది. అందులో చరణ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. అలాగే స్టార్ హీరో ప్రభాస్‌కు ఫోన్ చేసి అతని పెళ్లి గురించి మాట్లాడారు. శర్వానంద్(Sharwanand), నిర్మాత విక్రమ్(Vikram), చరణ్ (Ram Charan) స్నేహితుడు వికాస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చరణ్ స్కూల్ టీచర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రామ్ చరణ్‌ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. (Unstoppable Season 4)
నీకు ఎదురైన అపజయాలను ఎలా ఎదుర్కొన్నావు?
రామ్‌చరణ్: ఏది జరిగినా దాన్ని నుంచి నేర్చుకోవచ్చు. చేసిన తప్పులను చేయకుండా ముందుకుపోతుంటా. ఇంట్లో పెద్దల మాట వింటాను. వాళ్ల మాట వింటేనే మనం తప్పులు చేయకుండా ఉంటాం. ఎప్పుడూ రియాలిటీలో బతుకుతుంటా. ఏదైనా జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడమే గెలిచినట్లు. దేవుడి దయ వల్ల నన్ను ఎంతోమంది సపోర్ట్ చేస్తుంటారు. సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందకపోతే నేను నిరాశపడతానేమో కానీ, నా అభిమానులు మాత్రం నాపై పూర్తి నమ్మకంతో ఉంటారు. వాళ్లంతా నాకు రక్త సంబంధీకులతో సమానం.
ఉపాసనను తొలిసారి ఎప్పుడు కలిశావు?
రామ్‌చరణ్: వాళ్ల ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు చూశాను. మేం మొదట్లో ఎప్పుడూ ఫైట్ చేసుకుంటూ ఉండేవాళ్లం. ఉన్నట్టుండి తనపై ప్రేమ కలిగింది. ఆ అమ్మాయి గుణానికి నేను ఫిదా అయ్యాను. చాలా సపోర్ట్ చేస్తుంటుంది.
ఉపాసనలో ఏ అలవాటు నీకు చిరాకు కలిగిస్తుంది?
రామ్‌చరణ్: లేటుగా నిద్ర లేస్తుంది... అదొక్కటే. తను ఒక పని అనుకుంటే అది ఎంత కష్టమైనా చేసి తీరుతుంది. అది నేను నేర్చుకోవాలి.
ఉపాసన ఏమని పిలుస్తుంది.? మీ ఇద్దరికీ గొడవ అయితే ఏం చేస్తావు?
రామ్‌చరణ్: రామ్ చరణ్ అనే పిలుస్తుంది. నేను తనని ఉప్సీ అని పిలుస్తా. రైమ్ అని నా కుక్క పిల్ల ఉంది. దాన్ని తన దగ్గరకు పంపిస్తాను. నాకు రైమ్ అంటే చాలా ఇష్టం. మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేయనున్న నా మైనపు విగ్రహంలో రైమ్ కూడా భాగమైంది.
బాలకృష్ణ: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?
రామ్ చరణ్ (నవ్వుతూ): నాకు మతిమరుపు సర్. నేను మర్చిపోయాను. ఫోన్ చేసి అడుగుదాం.
గణపవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని చరణ్ అన్నాడు . నిజమేనా?
ప్రభాస్ ఫోన్‌లో మాట్లాడుతూ: నేను యూరప్‌లో ఉన్నాను. ఇక్కడ ఎక్కడా గణపవరం అనే ఊరే లేదు.
రామ్‌చరణ్: నాకు అసలు ఆ ఊరు కూడా తెలియదు. అటు తిరిగి, ఇటు తిరిగి ఇది ప్రభాస్ షోలా ఉంది.
చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పు?
ప్రభాస్: చరణ్ చాలా మంచి వ్యక్తి. అందరి గురించి పాజిటివ్‌గా ఆలోచిస్తాడు. 2025లో చరణ్ ఎన్నో మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా.
మీరు ఎప్పటి నుంచి స్నేహితులు?
శర్వానంద్: ఏడో తరగతి నుంచి ఫ్రెండ్స్. నేను మొత్తం 7, 8 స్కూళ్లు మారాను. నాకంటే చరణ్ ఎక్కువ అల్లరి చేస్తాడు.
విక్రమ్: కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో నిద్రపోయేవాళ్లు. మా ముగ్గురికి ఒక వాట్సప్ గ్రూప్ ఉంది. దానికి Friends forever అనే పేరు చరణ్ పెట్టాడు.
ఉపాసన గురించి రామ్ చరణ్ చెప్పిన కంప్లైంట్ చెప్పండి?
రామ్‌చరణ్: ఏం చెప్పలేదని చెప్పండి.
శర్వానంద్: మేము ట్రిప్‌లో భార్యల గురించి ఎందుకు మాట్లాడుకుంటాం.
మీ ముగ్గురిలో లాస్ట్ మినిట్‌లో ప్లాన్ క్యాన్సిల్ చేేసది ఎవరు?
రామ్‌చరణ్: నేనే. నాకు బద్ధకం ఎక్కువ. బెడ్‌రూమ్ నుంచి హాల్లోకి రావడానికే ఆలోచిస్తాను. అందుకే లాస్ట్ మినిట్‌లో క్యాన్సిల్ చేస్తాను.
మీ ముగ్గురిలో ఎవరికి కోపం ఎక్కువ?
విక్రమ్: శర్వానంద్‌కు కోపం వస్తే కంట్రోల్ చేయలేం. రామ్ చరణ్ వెంటనే కంట్రోల్ అవుతాడు.
రామ్‌చరణ్ గురించి కంప్లైంట్ చెప్పండి?(Ram charan)
శర్వానంద్: కంప్లైంట్స్ ఏమీ లేవు. కానీ మంచి పనులు చాలా ఉన్నాయి. చరణ్ చేేస సహాయాలు ఎవరికీ తెలియవు. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు నేను అదృష్టవంతుడిని. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం రామ్‌చరణే.
మీ ఫ్రెండ్స్ గురించి ఒక్క మాటలో చెప్పు?
రామ్‌చరణ్: విక్రమ్ నా చిన్ననాటి స్నేహితుడు. శర్వానంద్ చాలా నిజాయతీగా ఉంటాడు.
మీ అక్క చెల్లెలు నీకేదో చెప్పాలట..
సుస్మిత: చరణ్ ఎక్కువగా ఫ్రాంక్ చేస్తుంటాడు. రామ్ చరణ్‌కు జాసూస్ అనే సీక్రెట్ నేమ్ ఉంది. మేం అలానే పిలుస్తాం. అతడికి అన్నీ తెలిసిపోతుంటాయి. 2025లో మేం చరణ్‌తో కలిసి ట్రిప్ వెళ్లాలని అనుకుంటున్నాం.
అకీరా గురించి చెప్పంచి?
రామ్‌చరణ్: బాబాయ్‌లాగే బుక్స్ ఎక్కువ చదువుతాడు. నా పుట్టినరోజుకు కూడా బుక్స్ గిఫ్ట్‌గా ఇస్తుంటాడు. పియానో చాలా బాగా వాయిస్తాడు. ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని నేను కూడా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే వస్తాడు.