Ram Charan: రామ్‌చరణ్ తదుపరి చిత్రాలపై టీమ్ క్లారిటీ..
ABN , Publish Date - Jan 28 , 2025 | 01:10 PM
గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ కావడంతో దిల్ రాజు నష్టాల్లో మునిగిపోయారని, అతన్ని ఆదుకోవడంలో భాగంగా మరో సినిమా చేస్తానని చరణ్ భరోసా ఇచ్చారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
‘గేమ్ చేంజర్’ (Game Changer) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) హీరోగా దిల్ రాజు (Dil raju) నిర్మాణ సంస్థలో మరో చిత్రం చేయబోతున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని చరణ్ టీమ్ (Charan Team Clairty) తెలిపింది. 'గేమ్ ఛేంజర్’ ఫ్లాప్ కావడంతో దిల్ రాజు నష్టాల్లో మునిగిపోయారని, అతన్ని ఆదుకోవడంలో భాగంగా మరో సినిమా చేస్తానని చరణ్ భరోసా ఇచ్చారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. దిల్‌రాజు కూడా చరణ్ కోసం ఓ కథ సిధ్దం చేయించే పనిలో ఉన్నారని కూడా టాక్ వినిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నీ నిరాధారమైనవే అని చరణ్ పీ.ఆర్ టీమ్ కొట్టిపారేసింది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో ఆర్‌సీ 16 (RC16) చేస్తున్నాడని, ఆ తరవాత సుకుమార్‌తో ఆర్‌సీ 17 (RC17) ఉంటుందని ఇవి మినహా చరణ్ కొత్త సినిమాలేం ఒప్పుకోలేదని పీఆర్ టీమ్ తెలిపింది. (RC no movie th Dil raju)
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 29 నుంచి హైదరాబాద్‌లో మొదలవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం మైసూర్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజగా షెడ్యూల్‌లో చరణ్‌తోపాటు సినిమాలో ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నా బుచ్చిబాబు. ఈ సినిమాతో ఈ ఏడాది గడిచిపోతుంది. తదుపరి సుకుమార్‌తో సినిమా ఉంటుంది. ప్రస్తుతానికి రామ్ చరణ్ మూవీ లైన్ అప్ ఇదే.