Game Changer: ఓటీటీలోకి రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఎప్పుడు, ఎక్కడంటే?
ABN , Publish Date - Jan 29 , 2025 | 05:33 PM
Game Changer: సినీ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన 'గేమ్ ఛేంజర్' సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రానుంది. మరోవైపు ఎంతో హాట్ టాపిక్‌గా మారిన ఈ సినిమా కలెక్షన్ల లెక్క ఎంతంటే..
ఈ సంక్రాంతికి రిలీజై తీవ్ర నిరాశపరిచిన పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. రామ్ చరణ్ కెరీర్ లో మరిచిపోలేని డిజాస్టర్ గా నిలిచిపోయింది. దర్శకుడు శంకర్ ఇంకా 90స్ దృక్పథంతోనే సినిమా చేశాడంటూ అభిమానులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మరోవైపు ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకునే కలెక్షన్స్ గేమ్ లో ఈ సినిమా ఎక్కడి నిలిచింది? ఏది ఏమైనప్పటికి ఈ సినిమా రిజల్ట్ అందరిని తీవ్ర నిరాశపరచడంతో అతి తొందర్లోనే ఓటీటీలోకి రానుంది. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందంటే..
'గేమ్ ఛేంజర్' సినిమా విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా హక్కులను దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 18 రోజులకు గాను బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 130 కోట్లను మాత్రమే సొంతం చేసుకుంది. రామ్ చరణ్, అంజలి నటన సినిమాకి హైలెట్ గా నిలిచినా కథనంలో మాత్రం అనేక లోటుపాట్లు కనిపించాయి.
Also Read-Rajamouli: రాజమౌళి కెరీర్‌లో ఒకే ఒక రిమార్క్
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఉత్తర ప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న రామ్ నందన్ (రామ్ చరణ్), తన ప్రియురాలు దీపిక (కియారా అద్వాణీ) చెప్పిన మాట కోసం ప్రయత్నించి ఐఏఎస్‌గా సెలక్ట్ అయ్యి, తన సొంత జిల్లా వైజాగ్‌కు కలెక్టర్‌గా వస్తాడు. వైజాగ్ వచ్చీ రాగానే అక్కడ ఉన్న రౌడీ షీటర్స్‌కి, రాజకీయ నాయకుల సహకారంతో దందాలు చేసే వాళ్లకి వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్‌తో మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి (ఎస్.జె. సూర్య)కి, రామ్ నందన్‌కి మధ్య వార్ మొదలవుతుంది. మరోవైపు తన తండ్రి సీఎం సత్యమూర్తి (శ్రీకాంత్) సీట్ కోసం మోపిదేవి చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటి వాడికి తలనొప్పిగా మారిన రామ్ నందన్‌ని పొలిటికల్ పవర్ ఉపయోగించి మోపిదేవి ఏం చేశాడు? మోపిదేవి ప్రయత్నాలను రామ్ నందన్ ఎలా తిప్పికొట్టాడు? ఈ క్రమంలో సీఎం సత్యమూర్తి ఎలా చనిపోయాడు? ఆయన చనిపోతూ తన కొడుకుని కాదని.. రామ్ నందన్‌కి సీఎం సత్యమూర్తి బాధ్యతలను ఎందుకు అప్పగించాడు? అసలు అప్పన్న (రామ్ చరణ్), పార్వతి (అంజలి) ఎవరు? రామ్ నందన్ కథలోకి వారెలా వచ్చారు? అనేది కథ