రాజు గారి దొంగలు కథేంటి..
ABN , Publish Date - Mar 15 , 2025 | 07:43 PM
వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన రాజు గారి దొంగలు చిత్రం గురించి దర్శకుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు
లోహిత్ కల్యాణ్(lohit kalyan), రాజేష్ కుంచాడా, జోషిత్ రాజ్ కుమార్, కైలాష్ వేలాయుధన్, పూజా విశ్వేశ్వర్, టీవీ రామన్, ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'రాజు గారి దొంగలు’. నడిమింటి లిఖిత సమర్పణలో హిటాసో ఫిలిం కంపెనీ బ్యానర్ పై నడిమింటి బంగారు నాయుడు నిర్మిస్తున్నారు. లోకేష్ రనాల్ హిటాసో (lokesj ranal hitaso) దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 21న విడుదలకు సిద్ధమైంది.
దర్శకుడు మాట్లాడుతూ "వైవిధ్యమైన కథతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది’’ అని అన్నారు.