Rajinikanth: 'బాషా'ని వదిలేసుకున్న స్టార్ హీరోలు..
ABN , Publish Date - Jan 14 , 2025 | 08:31 AM
Rajinikanth: 1995లో రిలీజైన గ్యాంగ్ స్టార్ డ్రామా మూవీ 'బాషా'. ఇందులో రజీని కథానాయకుడిగా, నగ్మా కథానాయికి. రఘువరన్ విలన్. సినిమా ఒక సంచలనం. అయితే ఈ సినిమాని కొందరు తెలుగు స్టార్ హీరోలు వదులుకున్నారు. అలాగే ఈ సినిమాని కొన్ని స్టోరీస్ నుండి కాపీ కొట్టారు.
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా ఎదిగిన వ్యక్తి రజినీకాంత్. ఇంకా ఆయన బాషా మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నామలై( అరుణాచలం) సినిమా తర్వాత దర్శకుడు సురేష్ కృష్ణ రజినీతో కోలాబ్ అయ్యి ఈ సంచలన చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కేవలం కోలీవుడ్ నే కాదు అన్ని ఇండస్ట్రీస్ ని షేక్ చేసింది. అయితే ఈ సినిమాని కొందరు తెలుగు స్టార్ హీరోలు వదులుకున్నారు. అలాగే ఈ సినిమాని కొన్ని స్టోరీస్ నుండి కాపీ కొట్టారు. ఇంతకీ ఈ సినిమాని వదిలేసుకున్న స్టార్ హీరోలు ఎవరు? ఈ సినిమాకి అసలు ఇన్స్పిరేషన్ ఏంటంటే..
1995లో రిలీజైన గ్యాంగ్ స్టార్ డ్రామా మూవీ 'బాషా'. ఇందులో రజీని కథానాయకుడిగా, నగ్మా కథానాయికి. రఘువరన్ విలన్. సినిమా ఒక సంచలనం. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సురేష్ కృష్ణ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామని భావించాడు. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకి ఈ సినిమా స్పెషల్ షో కూడా వేశాడంట. కానీ.. మన హీరోలకి ఈ సినిమా నచ్చలేదట. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. బాలకృష్ణ రీమేక్ లకు దూరం అంటూ ఈ ప్రాజెక్ట్ కు నో చెప్పేశాడట. దీంతో ఈ సినిమాని డైరెక్ట్ తెలుగులోనే డబ్ చేసి రిలీజ్ చేశారు. సినిమా బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 ఏళ్ళు గడుస్తుండటంతో ఈ సినిమాని రీ రిలీజ్ చేయనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే. తెలుగులో కాకపోయినా ఈ సినిమాని అనేక భాషల్లో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా స్టోరీ కి ఇన్స్పిరేషన్ మాత్రం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'హమ్' సినిమాతో పాటు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి 'సామ్రాజ్యం' సినిమా.