Robinhood: వార్నర్ కి వార్నింగ్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్
ABN , Publish Date - Mar 24 , 2025 | 06:08 PM
‘రాబిన్ హుడ్’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ స్పీచ్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచమంత అభిమానులను సొంతం చేసుకున్న వార్నర్‌ను కించపరిచేలా మాట్లాడారు.
నితిన్ (Nithin)హీరోగా వెంకీ కుడుముల (venky kudumula) దర్శకత్వం వహించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్థం అవుతోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ (david-warner)వార్నర్ హాజరయ్యారు. వేదికపై ఆయన స్టెప్పులేసి అలరించారు. '
అయితే వేడుకలో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) స్పీచ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం అద్భుతంగా ఉండబోతోందని అన్న ఆయన నితిన్, శ్రీలీల, దర్శకుడు వెంకీ కుడుముల హార్డ్ వర్క్ చేశారని చెప్పుకొచ్చారు. ప్రపంచమంత అభిమానులను సొంతం చేసుకున్న వార్నర్‌ను కించపరిచేలా మాట్లాడారు. "ఓరే డేవిడ్ వార్నరూ.. దొంగ... కొడుకా... నువ్వు మాములోడివి కాదురోయ్. ఏ వార్నరూ.. బీ వార్నింగ్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వేదిక ముందున్న ఆహుతులు ఈ వ్యాఖ్యలకు షాక్ అయ్యారు.