Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కలిసిన రాజేంద్ర ప్రసాద్
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:22 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పలు విషయాలు చర్చించుకొన్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
అనంతరం పవన్‌కల్యాణ్‌ను ఆయన సన్మానించారు. రాజేంద్ర ప్రసాద్‌ను పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.
ఇటీవల పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాలను అయన సందర్శించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు(harihara Veeramallu) , ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి (OG)చిత్రాల్లో నటిస్తున్నారు.