Anil Ravipudi: రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడే..
ABN , Publish Date - Jan 15 , 2025 | 07:18 AM
కామెడీ రాయటం అంత్యంత కఠినమైన పని. ముఖ్యంగా అనిల్ మేనరిజమ్స్ తో చేయించే కామెడీని పేపర్ పై ఎలా పెడుతాడో అనేది చాలా మందికి అర్థం కాని విషయం. మరోవైపు ఆయన కామెడీని క్రింజ్ కంటెంట్ అంటూ అనేక విమర్శలు..
అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి మరోసారి విజేతగా నిలిచాడు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో పాటు ఫెస్టివల్ కలిసి రావడంతో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మరికొందరు అయితే ఈ సినిమానే సంక్రాంతి విన్నర్ గా డిక్లేర్ చేస్తున్నారు. ఈ సక్సెస్ లో మెయిన్ లీడ్ పోషించింది మాత్రం డైరెక్టర్ అనిల్ రావిపూడి అని చెప్పాలి.
టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత 100% సక్సెస్ రేట్ ను కొనసాగిస్తున్న ఒకే ఒక డైరెక్టర్ అనిల్ రావిపూడి. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఆయన వరుసగా కెరీర్ లో ఎనిమిదవ విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ సక్సెస్ అంతా ఈజీగా రాలేదనే చెప్పాలి. కామెడీ రాయటం అంత్యంత కఠినమైన పని. ముఖ్యంగా అనిల్ మేనరిజమ్స్ తో చేయించే కామెడీని పేపర్ పై ఎలా పెడుతాడో అనేది చాలా మందికి అర్థం కాని విషయం. మరోవైపు ఆయన కామెడీని క్రింజ్ కంటెంట్ అంటూ అనేక విమర్శలు వచ్చిన ఆయన మాత్రం వాటిని అసలు పట్టించుకోకుండా తాను అనుకున్నది స్క్రీన్ పై చూపించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఆయనను 'విన్నర్'గా నిలబెడుతున్నారు.
జాక్‌పాట్
సుప్రీమ్, పటాస్, రాజా ది గ్రేట్, F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, సరిలేరు నీకెవ్వరు, F3, భగవంత్ కేసరి ఇలాంటి కామెడీ కమ్ యాక్షన్ సినిమాలతో దూసుకుపోతున్న ఆయన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఈ సంక్రాంతికి 'దిల్ రాజు' దిల్ ఖుషి చేసిన ఆయన అంతా అందుకోవడంలో తప్పే లేదు. నెక్స్ట్ ఈ కామెడీ యాక్షన్ డైరెక్టర్ ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం కొట్టేయడంతో ఎలాంటి సినిమా చేయనున్నాడని సర్వత్రా ఆసక్తి నెలకొంది.