SSMB 29: రాజమౌళి సినిమా నుండి స్టార్ హీరో అవుట్
ABN , Publish Date - Jan 29 , 2025 | 03:37 PM
SSMB 29: తాజా సమాచారం ప్రకారం రాజమౌళి, మహేష్ బాబు చిత్రం నుండి ఓ టాలెంటెడ్ స్టార్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓ బాలీవుడ్ బ్యాడ్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న స్టార్ హీరో ఎవరు? మరి స్థానాన్ని భర్తీ చేస్తున్న బాలీవుడ్ బ్యాడ్ బాయ్ ఎవరంటే..
రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'SSMB 29' కోసం పూర్తి సినిమా ప్రపంచం వెయిట్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పనిచేస్తున్న కాస్ట్, టెక్నీషియన్స్ పై ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. అయినప్పటికీ ఈ సినిమాలో.. ప్రస్తుతం ఇండియన్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉన్నా టాలెంటెడ్ యాక్టర్, డైరెక్టర్, రైటర్ పనిచేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఆయన ఈ ప్రాజెక్ట్ ని వదిలేసినట్లు తెలుస్తోంది. దీంతో ఓ బాలీవుడ్ బ్యాడ్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో అనాఫిషియల్ గా హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక రోల్ లో కన్ఫార్మ్ అయినట్లే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి ఎవరికీ చెప్పకుండానే.. కొన్ని సీన్లను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అలాగే ,మహేష్ పాస్ పోర్టుని లాక్ చేసి.. ప్రస్తుతం కెన్యాలో షూటింగ్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్, టాలెంటెడ్ యాక్టర్, టెక్నీషియన్ పృథ్వీ రాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉందట.
కానీ ఎందుకో పృథ్వీ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చిందట. పృథ్వీ స్థానాన్ని బాలీవుడ్ బ్యాడ్ బాయ్ జాన్ అబ్రహం భర్తీ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
మరోవైపు.. మూవీ యూనిట్ కెన్యాకు బయలుదేరినట్లు తెలుస్తుంది. జక్కన్నతో పాటు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కెన్యాలోని ప్రఖ్యాత అంబోసెలి నేషనల్ పార్క్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం. కానీ.. ప్రస్తుతానికి మహేష్ బాబు సన్నివేశాలను తెరకెక్కించలేదని తెలుస్తోంది. మరోవైపు అనుకున్న దానికంటే ముందే మూవీ స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాగా, పృథ్వీ లాంటి నటుడు ప్రాజెక్ట్ కు దూరం కావడం కొందరిని బాధిస్తుంది. మరి జాన్ అబ్రహం ఈ పాత్రలో ఎలా అలరిస్తాడో, రాజమౌళి మ్యాజిక్ ఎలా పని చేస్తోందో తెలియాలి అంటే కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే.